MovieGQ

Chukkallo Chandrudee

Takkari Donga (2002) · Track 3 of 6

Song Details

Lyrics

చుక్కల్లో చంద్రుడీ చిన్నోడు చూపుల్లో సూర్యుడీ సోగ్గాడు ముద్దొస్తూ ఉన్నవే అమ్మాయి మోగించెయ్ మంటవా సన్నాయి సింగంలా దూకరా మగధీరుడా దమ్మెంతో చూపరా పని వీరుడా మాటల్తో చంపకే ఓ బాలికా వస్తాలే కాసుకో నీ ఓపిక హలో హైసలకిడి బావ నను సోకులకిడి కోవ వద్దనక ముద్దులతో మురిపించవా హలో పిట్టనడుము పిల్లో నీ వాలు చూపువల్లో నేను మరి తేలికగా పడిపోనల్లా చుక్కల్లో చంద్రుడీ చిన్నోడు ముద్దొస్తూ ఉన్నవే అమ్మాయి చరణం: 1 పాల పొంగు పాప తెగరువ్వకే నవ్వు నీలి కళ్ళ చేప వలవెయ్యకే నువ్వు గాలిలాగ వచ్చి నను తాకితే నువ్వు మాయదారి మోహం తొణికించదా నవ్వు ఇద్దరి కధ ఇవ్వాళే తెంచెయ్యకు విచ్చల విడి దుకాణం పెట్టెయ్యకు హద్దిరి మన యవ్వారం పెంచెయ్యకు అద్దిరిపడి గుడారం దించెయ్యకు హలో పిట్టనడుము పిల్లో నీ వాలు చూపువల్లో నేను మరి తేలికగా పడిపోనల్లా హలో హైసలకిడి బావ నను సోకులకిడి కోవ వద్దనక ముద్దులతో మురిపించవా ముద్దొస్తూ ఉన్నవే అమ్మాయి చుక్కల్లో చంద్రుడీ చిన్నోడు చరణం: 2 టిప్పుటాపు బావ మొహమాటమేలేదు అప్టు డేటు గుంటే డౌటన్నదే రాదు రాలుగాయి పిల్లా చెలగాటమే వద్దు కాలు జారకుండా మన కుందిలే హద్దు కష్టమనకు ఓ రయ్యో ఈ పూటకు ఇష్టసఖిని ఇలాగే జోకొట్టకు కూతపెరిగె నివాళే ఈ పిట్టకు తోడుపెరుగు నివాలి నా పెట్టకు ఇలా చూడు టక్కరి దొంగ చెల ఈడు పిట్టకు బెంగ చీరలకి సిగ్గులకి సెలవే ఇక హల్లో హంసనడక పిల్లో సిరి మల్లెల చిరుజల్లో ఇప్పుడిక తప్పదిక తొలివేడుక ఇలా చూడు టక్కరి దొంగ చెల ఈడు పిట్టకు బెంగ చీరలకి సిగ్గులకి సెలవే ఇక హల్లో హంసనడక పిల్లో సిరి మల్లెల చిరుజల్లో ఇప్పుడిక తప్పదిక తొలివేడుక

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Takkari Donga

See All