MovieGQ

Ra Ra Swami Ra Ra

Siri Siri Muvva (1976) · Track 8 of 8

Lyrics

స్వామి రారా నా పాలి దిక్కు నీవేరా నీ పాదములంటి మ్రొక్కేరా నీ దానరా రావేలరా నన్నేలరా భరత శాస్త్ర సంభరిత పదద్వయ చరిత నిరత సుమధుర మంగళ గళ రారా స్వామి రారా రాగాలెన్నో పండిన గారాల నీ మెడలో అనురాగ మాలికలే వేయాలని నీ చల్లని చరణాలు చల్లిన కిరణాలలో రేపటి కోసం చీకటి రెప్పల తెర తీయాలని పిలిచాను ఎదుట నిలిచాను కోరి కోరి నిన్నే వలచాను(2) చరణం: 1 గంగ కదలి వస్తే కడలి ఎలా పొంగిందో యమున సాగి వస్తే ఆ గంగ ఏమి పాడిందో ఆమని వచ్చిన వేళ అవని ఎంత మురిసిందో మోహన వేణువు తాకిన మోవి ఎలా మెరిసిందో ఊగింది తనవు అలాగే పొంగింది మనసు నీలాగే చరణం: 2 శృతి కలిసిందెన్నడో సిరిమువ్వల సవ్వడిలో జత కలిసిందప్పుడే ఆ గుడిలో నీ ఒడిలో (2) మువ్వనై పుట్టాలని అనుకున్నానొకనాడు (2) దివ్వేనై నీ వెలుగులు రువ్వనీ ఈనాడు పిలిచాను ఎదుట నిలిచాను కోరి కోరి నిన్నే వలచాను

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Siri Siri Muvva

See All