MovieGQ

Gajje Gallumantunte

Siri Siri Muvva (1976) · Track 7 of 8

Lyrics

ఝణణ ఝణ నాదంలో ఝళిపించిన పాదంలో జగము జలదరిస్తుంది పెదవి పలకరిస్తుంది గజ్జ ఘల్లుమంటుంటే గుండె ఝల్లుమంటుంది(2) గుండె ఝల్లుటుంటే కవిత వెల్లువవుతుంది(2) చరణం: 1 అమరావతి శిల్పంలో అందమైన కలలున్నాయి అవి నీలో మిలమిల మెరిసే అర కన్నుల కలలైనాయి(2) నాగార్జున కొండ కొనలో నాట్యరాణి కృష్ణవేణి(2) నీ విరుపుల మెరుపులలో నీ పదాల పారాణి చరణం: 2 తుంగబధ్ర తరంగాలలో సంగీతం నీలో ఉంది అంగరంగ వైభవంగా పొంగి పదం పాడిస్తుంది(2) అచ్చ తెలుగు నుడికారంలా మచ్చ లేని మమకారంలా(2) వచ్చినది కవితా గానం నీవిచ్చిన ఆరవ ప్రాణం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Siri Siri Muvva

See All