MovieGQ

Jummandi Nadam

Siri Siri Muvva (1976) · Track 2 of 8

Lyrics

ఝుమ్మంది నాదం సయ్యంది పాదం తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీల(2) చరణం: 1 ఎదలోని సొదలా ఎలదేటి రొదలా కదిలేటి నదిలా కలల వరదలా(2) చలిత లలిత పద కలిత కవితలెద సరిగమ పలికించగా స్వర మధురిమలొలికించగా సిరిసిరిమువ్వలు పులకించగా ఝుమ్మంది నాదం సయ్యంది పాదం తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీల చరణం: 2 నటరాజ ప్రేయసీ నటనాల ఊర్వశి నటియించు నీవని తెలిసి(2) ఆకాశమై పొంగె ఆవేశం కైలాసమే ఒంగె నీకోసం మెరుపుంది నాలో అది నీ మేని విరుపు ఉరుముంది నాలో అది నీ మువ్వ పిలుపు చినుకు చినుకులో చిందు లయలతో కురిసింది తొలకరి జల్లు విరిసింది అందాల హరివిల్లు ఈ పొంగులే ఏడు రంగులుగా ఝుమ్మంది నాదం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Siri Siri Muvva

See All