Song Details
Lyrics
నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించె గంధం నేనవని నన్నే నీలో కలుపుకొని కొలువుంచె మంత్రం నీవవని ప్రతి పూట పువ్వై పుడతా నిన్నే చేరి మురిసేలా ప్రతి అడుగు కోవెలనౌతా నువ్వె నెలవు తీరేలా నూరెళ్ళు నన్ను నీ నివేదనవని నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించె గంధం నేనవని చరణం: 1 వెన్ను తట్టి మేలు కొలిపిన వేకువ నువ్వే కన్నె ఈడు నేను మరచిన వేళవు నువ్వే వేలు పట్టి వెంట నడిపిన దారివి నువ్వే తాళి కట్టి ఏలవలసిన దొరవూ నువ్వే రమని చెరను దాటించె రామ చంద్రుడా రాధ మదిని వేదించె శ్యామ సుందరా మనసిచ్చిన నెచ్చెలి ముచ్చట పచ్చగ పండించరా నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించె గంధం నేనవని చరణం: 2 ఆశ పెంచుకున్న మమతకు ఆదారమా శ్వాస వీణలోని మధురిమ నీదే సుమా గంగ పొంగునాప గలిగిన కైలశమా కొంగు ముళ్ళులోన ఒదిగిన వైకుంటమా ప్రాయమంత కరిగించి దారపోయన ఆయువంత వెలిగించి హారతియ్యనా... నిన్నే నిన్నే నిన్నే ... ఓ నిన్నే నిన్నే నిన్నే ...
Lyrics sourced from public databases. May contain errors.