MovieGQ

Thaguna Idhi Mama Thamare Itu Balkanaguna

Ramudu Bheemudu (1964) · Track 6 of 10

Song Details

Lyrics

తగునా ఇది మామా! తమరే ఇటు బల్క నగున తగునా ఇది మామా! నిగమ మార్గములు తెలిసిన నీవే ఇటులనదగునా... తగునా ఇది మామా! అల్లుడనగనెవడు మీ అమ్మాయికి మగడూ అల్లుడనగనెవడు మీ అమ్మాయికి మగడూ నీవు కాళ్ళు కడిగి కన్యాదానము చేసిన ఘనుడు ఆ ఘనుని మీద అలుక బూన ఏటికి చీటికి మాటికి తగునా ఇది మామా! తమరే ఇటు బల్క నగున తగునా ఇది మామా! ఫోఫోర ఫొమ్మికన్ నా గృహమ్మునకు భోజనమ్మునకు ఇక రా వలదు రా తగదు చీ పో ఫోఫోర ఫొమ్మికన్ అరెరే ఎంతటి మోసగాడవుర నాకే టోపీ వేసినావుర అరెరే ఎంతటి మోసగాడవుర నాకే టోపీ వేసినావుర నీ సాహసము పరీహాసము నీ సాహసము పరీహాసము నిర్భాగ్యుల తోటి సహవాసము సహించను క్షమించను యోచించను నీ మాటన్ వచ్చిన బాటన్ పట్టుము వేగన్ ఫోఫోర ఫొమ్మికన్ ఫోఫోర ఫొమ్మికన్ నా గృహమ్మునకు భోజనమ్మునకు ఇక రా వలదు రా తగదు చీ ఫో ఫో కొడుకులు లేనందుకు తల కొరివి బెట్టువాడనే నీకు కొరివి బెట్టువాడనే డైరెక్టుగ స్వర్గానికి చీటి నిచ్చువాడనే తల్లి లేని పిల్ల ఉసురు తగలదె ఒంటిగ ఉంచగ తగునా ఇది మామా! అరె ఊరికెల్ల మొనగాడినే అరె ఊరికెల్ల మొనగాడినే పెద్ద మిల్లు కెల్ల యజమానినే నీ డాబూసరి బలే బిత్తరి నీ డాబూసరి బలే బిత్తరి నిజమేనని నమ్మితి పోకిరి దురాత్ముడ దుష్టాత్ముడ గర్వాత్ముడ నీచుడా ఇపుడె తెలిసెన్ నీ కథ ఎల్లన్ ఫోఫోర ఫొమ్మికన్ ఫోఫోర ఫొమ్మికన్ నా గృహమ్మునకు భోజనమ్మునకు ఇక రా వలదు రా తగదు చీ ఫో ఫో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ramudu Bheemudu

See All