Soundarya Lahari
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- K.S. Chithra
Lyrics
- సౌందర్యలహరి... సౌందర్యలహరి...
సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి
శృంగారనగరి స్వర్ణమంజరి రావే రసమాధురీ
వన్నె చిన్నెల చిన్నారి నీ జంట కోరి
ఎన్ని జన్మలు ఎత్తాలే ఈ బ్రహ్మచారి
కల నుంచి ఇల చేరి కనిపించు ఓసారి
సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి
పాల చెక్కిళ్లూ జుజుజుజు జుజుజుజు
దీపాల పుట్టిళ్లూ జుజుజుజు జుజుజుజు
పాల చెక్కిళ్లూ దీపాల పుట్టిళ్లూ
అదిరేటి అధరాలు హరివిల్లులు
ఫక్కున చిందిన నవ్వులలో ఆ...
లెక్కకు అందని రతనాలు ఆ...
యతికైన మతిపోయే ప్రతిభంగిమా
ఎదలోనె పురివిప్పి ఆడింది వయ్యారి
సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి
నీలికన్నుల్లూ జుజుజుజు జుజుజుజు
నా పాలి సంకెళ్లూ జుజుజుజు జుజుజుజు
నీలికన్నుల్లూ నా పాలి సంకెళ్లూ
నను చూసి వలవేసి మెలివెయ్యగా
ఊసులు చెప్పిన గుసగుసలు ఆ...
శ్వాసకు నేర్పెను సరిగమలు ఆ...
కలగంటి తెలుగింటి కలకంఠినీ
కొలువుంటె చాలంట నాకంట సుకుమారి
సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి
సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి
Pelli Sandhadi
Movie More SongsSoundarya Lahari Keyword Tags
-
-