Chemma Chekka
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- S.P. Balasubrahmanyam
Lyrics
- సాకీ:
అభ్రపథమ్మున విభ్రమ విలసిత శుభ్రకౌముదీ దీపికా...
దుగ్ధాంభోనిధి జనిత లలిత సౌందర్య ముగ్ధశ్రీ నాయికా...
పల్లవి:
చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ
ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా
లేత పెదవులే పగడ కాంతులు
బొట్టు ఎరుపులే పొద్దుపొడుపులు
రామచిలుక ముక్కుపుడక రమణిపాప ఓ ఓ
చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ
ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా
చరణం: 1
తారలెన్ని ఉన్నా ఈ తళుకే నిజం
చలనచిత్రమేమో నీ చక్కని చెక్కెర శిల్పం
మనసు తెలుసుకుంటె అది మంత్రాలయం
కనులు కలుపుకుంటె అది కౌగిలికందని ప్రణయం
ముందు నువ్వు పుట్టి తరువాత సొగసు పుట్టి
పరువానికి పరువైన యువతి
వయసు కన్ను కొట్టి నా మనసు వెన్ను తట్టి
మనసిచ్చిన మరుమల్లెకు మరిది
దోరసిగ్గు తోరణాల తలుపు తీసి ఓ ఓ
చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ
ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా
చరణం: 2
చిలిపి మనసు ఆడే ఒక శివతాండవం
పులకరింత కాదు అది పున్నమి వెన్నెల కెరటం
పెదవిచాటు కవిత మన ప్రేమాయణం
వలపు ముసురుపడితే పురివిప్పిన నెమలి పింఛం
అందమారబెట్టే అద్దాల చీరకట్టే
తడి ఆరిన బిడియాల తరుణి
మనసు బయటపెట్టే మౌనాలు మూటగట్టి
మగసిరిగల దొరతనమెవరిదనీ
బొడ్డుకాడ బొంగరాలు ఆడనేల ఓ ఓ
చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ
ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా
లేత పెదవులే పగడ కాంతులు
బొట్టు ఎరుపులే పొద్దుపొడుపులు
రామచిలుక ముక్కుపుడక రమణిపాప ఓ ఓ
చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ
చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ
Pelli Sandhadi
Movie More SongsChemma Chekka Keyword Tags
-
-