Hrudayamane
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- S.P. Balasubrahmanyam
Lyrics
- హా... హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమ ప్రేమ
కోరస్: ప్రేమ ప్రేమ
ఆ... త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం ప్రేమ ప్రేమ
కోరస్: ప్రేమ ప్రేమ
అణువణువును చెలిమికి అంకితమిచ్చును ప్రేమా
తను నిలువున కరుగుతు కాంతి పంచునది ప్రేమా
గగనానికి నేలకు వంతెన వేసిన వానవిల్లు ఈ ప్రేమ
కోరస్: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
ఆ... హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం
కోరస్: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
హా ఇవ్వటమే నేర్పగల ఈ ప్రేమా
తనకొరకు ఏ సిరిని అడగదు కదా
నవ్వడమే చూపగల ఈ ప్రేమా
మంటలనె వెన్నెలగ మార్చును కదా
గాలికి గంధము పూయడమే పూలకు తెలిసిన ప్రేమసుధ
రాలిన పువ్వుల జ్ఞాపకమే కాలం చదివే ప్రేమకథ
ప్రియమైన తనవారి సుఖశాంతులే కోరి మురిసేటి గుణమే ప్రేమా
కోరస్: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
ఆ... హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం
కోరస్: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
ఏ జతనో ఎందుకో విడదీసి
వెంటాడి వేటాడు ఆటే ప్రేమా
మౌనముతో మనసునే శృతి చేసి
రాగాలు పలికించు పాటే ప్రేమా
శాశ్వత చరితల ఈ ప్రేమ
మృత్యువు ఎరగని చిరునామా
శ్వాసను మంగళహారతిగా వెలిగించేదే ఈ ప్రేమ
మరణాన్ని ఎదిరించి
మరణాన్ని ఎదిరించి మరుజన్మగా వచ్చి
మరణాన్ని ఎదిరించి మరుజన్మగా వచ్చి
కరుణించు వరమే ప్రేమా
కోరస్: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
ఆ... హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం
కోరస్: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
ఆ... త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం
కోరస్: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
Pelli Sandhadi
Movie More SongsHrudayamane Keyword Tags
-
-