MovieGQ

Nava Manmadhuda

Pelli Sandhadi (1996) · Track 1 of 9

Song Details

Lyrics

నవమన్మధుడా అతిసుందరుడా నువు చూసిన ఆ ఘనుడు అక్కా ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు శ్రీరాఘవుడా ప్రియ మాధవుడా నువు వలచిన ఆ ప్రియుడు చెల్లీ ఎవరే అతగాడు తుళ్ళే నీ వయసుకు జతగాడు గోరు వెచ్చని ఊపిరి వేయి వేణువులూదగ తొలి ముద్దు చిందించెనే వీణమీటిన తీరుగ ఒళ్ళు జల్లనే హాయిగ బిగి కౌగిలందించెనే రతి రాగాలే శృతి చేశాడే జత తాళాలే జతులాడాడే తనువంత వింత సంగీతమేదొ పలికే అక్కా ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు శ్రీరాఘవుడా ప్రియ మాధవుడా నువు వలచిన ఆ ప్రియుడు చెల్లీ ఎవరే అతగాడు తుళ్ళే నీ వయసుకు జతగాడు వాడి చూపుల దాడితో వేడి ఆవిరి రేపెనే నిలువెల్ల తారాడెనే చాటు మాటుల చోటులో ఘాటు కోరిక లూపెనె ఒడి చేరి తలవాల్చెనే జడ లాగాడే కవ్వించాడే నడుమొంపుల్లో చిటికేశాడే అధరాలతోనె శుభలేఖ రాసె మరుడే చెల్లీ ఎవరే అతగాడు తుళ్ళే నీ వయసుకు జతగాడు నవమన్మధుడా అతిసుందరుడా నువు చూసిన ఆ ఘనుడు అక్కా ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు శ్రీరాఘవుడా ప్రియ మాధవుడా నువు వలచిన ఆ ప్రియుడు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Pelli Sandhadi

See All