Sarigama Padanisa
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- S.P. BalasubrahmanyamM.M. KeeravaniSwetha Naga
Lyrics
- సరిగమ పదనిస రాగం త్వరపడుతున్నది మాఘం
తకధిమి తకధిమి తాళం ఎపుడెపుడన్నది మేళం
వన్నెల బొమ్మకు వెన్నెల మావకు కన్నులు కలిసిన వైనం
కన్నుల కలయిక కలలే కలుపగ మలుపొకటే కళ్యాణం
టట్టటారట్టట్టడం శభాష్ టట్టటారట్టట్టడం
టట్టటారట్టట్టడం టట్టటారట్టట్టడం
సరిగమ పదనిస రాగం త్వరపడుతున్నది మాఘం
తకధిమి తకధిమి తాళం ఎపుడెపుడన్నది మేళం
గళము కోసమే గాత్రమున్నది స్వరముకోసమే సరళి ఉన్నది
పొరుగుకోసమే పేపరున్నది అతిధి కోసమే తిధులు ఉన్నది శభాష్
పూతకోసమే మావి ఉన్నది కూతకోసమే కోయిలున్నది
కోత కోసమే కరెంటు ఉన్నది పెళ్ళి కోసమే పేరంటమున్నది
తాళి కోసమే ఆలి ఉన్నది జారిపోవుటకే చోళీ ఉన్నది
బ్రహ్మ చారికై మెస్సులున్నవి ఖర్మకాలుటకే బస్సులున్నవి
నగల కోసమే మెడలు ఉన్నవి సుముహూర్తానికి చూపులున్నవి
సరిగమ పదనిస రాగం త్వరపడుతున్నది మాఘం
తకధిమి తకధిమి తకధిమి తకధిమి తాళం ఎపుడెపుడన్నది మేళం
వన్నెల బొమ్మకు వెన్నెల మావకు కన్నులు కలిసిన వైనం
కన్నుల కలయిక కలలే కలుపగ మలుపొకటే కళ్యాణం
టట్టటారట్టట్టడం టట్టటారట్టట్టడం
అదిరింది బావగారు
టట్టటారట్టట్టడం టట్టటారట్టట్టడం
హృదయనాదమై మధురదాహమై ఎదలు దోచుటకే పాటలున్నవి
పొలములోపల కుప్పకుప్పగా కూలిపోవుటకే ఫ్లైటులున్నవి
రామకోటికే బామ్మలున్నది ప్రేమకాటుకే భామలున్నది
క్యూలకోసమే రేషన్లు ఉన్నది కునుకు కోసమే ఆఫీసులున్నవి
మధురవాణి మావెంట ఉన్నది నాట్యరాణి మా ఇంట ఉన్నది
కీరవాణిలా ఆర్టు ఉన్నది బాలులోని టాలెంటు ఉన్నది
వియ్యమందుటకే తొందరున్నది ఒకటయ్యేందుకే ఇద్దరున్నది
సససససస సమరిసనిప సరిగమ పదనిస రాగం
పనిమప మరి నిపమరిసని నినిసస రిసరిస పమరిస నిసరిమ పమరిస రాగం
పానిస పానిస పనిసనిపమ మపని మపని సనిపమరిస సరిగమ పదనిస రాగం
ఆ...ఆ...ఆ...ఆ... సరిగమ పదనిస రాగం
ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ
Pelli Sandhadi
Movie More SongsSarigama Padanisa Keyword Tags
-
-