Song Details
Lyrics
ఓ యవ్వన వీణ పువ్వుల వాన నువ్వెవరే నా ఎదలో చేరిన మైన నవ్వులతో తుళ్ళిపడే తుంటరి థిళ్ళాన నీ పేరు ప్రేమ ఔనా ఇవ్వాలే నిన్ను పోల్చుకున్న ఓ యవ్వన వీణ పువ్వుల వాన నువ్వుంటు పుట్టినట్టు నాకొరకు ఆచూకి అందలేదు ఇంతవరకు వచ్చింది గాని ఈడు ఒంటి వరకు వేదించలేదు నన్ను జంట కొరకు చూశాక ఒక్కసారి ఇంత వెలుగు నా వంక రాను అంది కంటి కునుకు ఈ అల్లరి ఈ గారడి నీ లీలే అనుకోన నీ పేరు ప్రేమ ఔనా ఇవ్వాలే నిన్ను పోల్చుకున్న ఓ యవ్వన వీణ పువ్వుల వాన ఏ పూల తీగ కాస్త ఊగుతున్న నీ లేత నడుమే అనుకున్నా ఏ గువ్వ కిలకిల వినపడినా నీ నవ్వులేనని వెళుతున్నా మేఘాల మెరుపులు కనబడిన ఏ వాగు పరుగులు ఎదురైనా ఆ రంగులో ఆ పొంగులో నీ రూపే చూస్తున్నా నీ పేరు ప్రేమ ఔనా ఇవ్వాలే నిన్ను పోల్చుకున్న ఓ యవ్వన వీణ పువ్వుల వాన నువ్వెవరే నా ఎదలో చేరిన మైన నవ్వులతో తుళ్ళిపడే తుంటరి థిళ్ళాన నీ పేరు ప్రేమ ఔనా ఇవ్వాలే నిన్ను పోల్చుకున్న నీ పేరు ప్రేమ ఔనా ఇవ్వాలే నిన్ను పోల్చుకున్న
Lyrics sourced from public databases. May contain errors.