MovieGQ

Anuragame Mantramga

Pelli (1997) · Track 6 of 6

Song Details

Lyrics

అనురాగమే మంత్రంగా అనుబంధమె సూత్రంగా మమత కొలువులో జరుగు పెళ్లికి మంగళ వాయిద్ద్యం పలికింది ఆహ్వానం ఓ... మంగళ వాయిద్ద్యం పలికింది ఆహ్వానం అనురాగమే మంత్రంగా మూడుముళ్లు తోనే పెళ్లి పూర్తి కాదు అని మరో ముడిగ చేరుకున్న స్నేహ బంధమిది సప్తపదితో ఆగరాదు జీవితం అని అష్ట పదిగ సాగమంది ప్రేమ పదము ఇది నాతి చరామి మంత్రములో అర్ధము తెలిసిన నేస్తముతో అడుగు కలుపుతు వెలుగు వెతుకుతూ సాగె సమయమిది ఆగని పయనమిది అనురాగమే మంత్రంగా మమత కొలువులో జరుగు పెళ్లికి మంగళ వాయిద్ద్యం పలికింది ఆహ్వానం అనురాగమే మంత్రంగా ఆడదంటే ఆడదానికి శత్రువు కాదు అని అత్త గుండెలోన కూడ అమ్మ ఉన్నదని బొమ్మలాట లాడుతున్న బ్రహ్మ రాతలని మార్చిరాసి చూపుతున్న మానవత్వమిది చరితల చదవని తొలి కథగా మనసులు ముడిపడు మనుగడగ తర తరాలుకు నిలిచి పొమ్మని తల్లిగ దీవించే చల్లని తరుణమిది అనురాగమే మంత్రంగా అనుబంధమె సూత్రంగా మమత కొలువులో జరుగు పెళ్లికి మంగళ వాయిద్ద్యం పలికింది ఆహ్వానం ఓ... మంగళ వాయిద్ద్యం పలికింది ఆహ్వానం అనురాగమే మంత్రంగా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Pelli

See All