Ararey Yemaindi
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Vedala Hemachandra
Lyrics
- అరెరెరె ఏ మది పరిగెడుతోంది నా మది
తెలియని హాయిది అలజడి రేపుతున్నది
తనువంతా పులకిస్తున్నది చిగురాకై వణికిస్తున్నది
నేనంటే నువ్వంటున్నదీ మనస్సు ఎందుకో మరీ
నీలాగే నాకూ ఉన్నదీ ఏదేదో అయిపోతున్నదీ
నా ప్రాణం నువ్వంటున్నదీ
మనసు ఎందుకే ప్రియా మరీ మరీ
అరెరెరె ఏ మది పరిగెడుతోంది నా మది
తెలియని హాయిది అలజడి రేపుతున్నది
లేతపెదవుల తీపి తడి
మొదటి ముద్దుకు ఉలిక్కిపడి మేలుకున్నదీ
ఎడమవైపు గుండె సడి
ఎదురుగా నీ పిలుపు విని వెల్లువైనది
తొలి వెన్నెలంటే తెలిపిందీ నీ జతలో చెలిమి
తొలి వేకువంటే తెలిసిందీ నీ చేయి తడిమి
అరెరెరె ఏ మది పరిగెడుతోంది నా మది
తెలియని హాయిది అలజడి రేపుతున్నది
కనులు చూసిన తొలి వరము
కలలు కోరిన కలవరము నిన్న లేదిది
చిలిపి సిగ్గులు పరిచయము
కొంటె నవ్వుల పరిమళము నచ్చుతున్నది
మన మధ్య వాలి చిరుగాలి నలిగిందే పాపం
పరువాల లాలి చెలరేగి చెరిగిందే దూరం
అరెరెరె ఏ మది పరిగెడుతోంది నా మది
తెలియని హాయిది అలజడి రేపుతున్నది
Ontari
Movie More SongsArarey Yemaindi Keyword Tags
-
-