Vayyari Kalahamsika
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Revanth
Lyrics
- నిచ్చలా... చంచలా...
వయ్యారి కలహంసికల మధురోహలా
ఉయ్యాలపై ఊర్వశిలా హాలా చంచలా
మనసే శ్రీ రాగంలా వినిపించే ఈ వేళా
ఆ రసరాగ రంజిత తంత్రి మణి వీణలా
తనువంత పులకింతలతో ధ్వనిస్తోందిలా
ధీమ్ తననననా
ధింతన నననా
దినననా...
రతీ మధనలీల సరోవర గబీర నాభీస్థలా
నీ నడుమునకలంకరిస్తున్న నవరత్న మణివే కళా
నీ అంతరంగ రంగత్తరంగ గంగా స్రవంతి గాంచి
చలించి పోయినదిలా - ఎలా
ఈ యదః పూర్వ నిచ్చలా
కలయే ఓ యోగంలా
కనిపించే ఈ వేళా
ఆ రసరాగ రంజిత తంత్రి మణి వీణలా
తనువంత పులకింతలతో ధ్వనిస్తోందిలా
జల జలాల శిత శంక సంకాస మృదుల కంఠస్థలా
నీ గళమున కలంకరిస్తున్నా ముత్యాల కంఠమాలా
నీ చిచ్చర రోహా సహస్త్ర దళకమల సౌరభముల గాంచి
చలించి పోయినదిలా
ఈ యదః పూర్వ నిచ్చలా
వలపే ఓ యాగంలా
అనిపించే ఈ వేళా
ఆ రసరాగ రంజిత తంత్రి మణి వీణలా
తనువంత పులకింతలతో ధ్వనిస్తోందిలా
Om Namo Venkatesaya
Movie More SongsVayyari Kalahamsika Keyword Tags
-
-