Aanandham
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Sarath Santhosh
Lyrics
- ఆనందం ఎంతో ఆనందం
ఎంతో ఆనందం ఆనందం
ఎంతో ఆనందం ఎంతో ఆనందం
అమ్మాయల్లె పుట్టడమన్నది చాలా ఆనందం
అందంగానే ఎదగడమన్నది ఇంకా ఆనందం
అందాలన్ని అమ్మాయైతే చాలా ఆనందం
ఆ అమ్మాయే నా సొంతం అయితే ఇంకా ఆనందం
ఆశలు దీర్చే అతగాడొస్తే అతగాడే నా జతగాడైతే
చిన్న ఆనందం
కాదు అది చిన్మయనందం
చిట్టి ఆనందం
కాదు అది సృష్టి ఆనందం
కాస్త ఆనందం కాదు అది శాశ్వత ఆనందం
ఎంతో ఆనందం ఎంతో ఆనందం
ఆనందం
ఒకసారైనా నువు కనబడితే నయనానందం
ఒకమాటైనా పలికావంటే శ్రవణానందం
ఒక అడుగైనా నాతో వేస్తే అంతా ఆనందం
ఒక లేఖైనా నాకే రాస్తే అఖిలానందం
లేఖలు అన్నీ శుభలేఖలైతే
అడుగులు అన్నీ ఏడడుగులైతే
చిన్న ఆనందం
కాదు అది చిన్మయనందం
చిట్టి ఆనందం
కాదు అది సృష్టి ఆనందం
పై పై ఆనందం కాదు అది పవిత్ర ఆనందం
సిగలో పూలే పిలుపందిస్తే పుస్పానందం
గదిలో పొగలే గంతులు వేస్తే ధూపానందం
పెదవులు కలిసి ముద్దై పోతే శబ్ధానందం
నిదరే కానీ నిదరే పోతే శయనానందం
ఒకరికి ఒకరే గురువై పోతే
ఒడి ఒడి వోలే ఒకటైపోతే
చిన్న ఆనందం
కాదు అది చిన్మయనందం
చిట్టి ఆనందం
కాదు అది సృష్టి ఆనందం
అలౌకికానందం అది అద్వైతానందం
ఆనందం ఎంతో ఆనందం
ఎంతో ఆనందం ఆనందం
అంతా ఆనందం అంతా ఆనందం
Om Namo Venkatesaya
Movie More SongsAanandham Keyword Tags
-
-