Brahmothsava
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- బ్రహ్మోత్సవ బ్రహ్మానందము నీకా
బండెడు బాధలు నీ భక్తునికా
ధగ ధగ ధగ ధగ ధగద్దగిత
సద్ధర్మల సద్బ్రహ్మాండ నాయకా
నిగ నిగ నిగ నిజ రక్తి నిష్యంద
భక్తి భవబంధ ముక్తి దాయక
కఠోర దంష్ట్రాల కన్నెర్ర జేసి
కాల కోట కీలికల గుప్పించి
బుస బుస బుసమని బుసలు కొట్టి
పదివేల పగడాల పడగలెత్తు
తొలి శేష వాహనముపై
సర్వ శేషివై చేరక
సత్య నిరూపణ చేయక
బ్రహ్మోత్సవ బ్రహ్మానందము నీకా
ఈ బండెడు బాధలు భక్తునికా
ఝమ్ ఝమ్ ఝమ్ రవ జంజా మారుత
జగద్విలయ జంకార హుంకార
సుండాదండోద్దండ చండ
బహు బాహు దండ పరి మండిత
హనుమద్వాహానమునెక్కిరా
అనుమానాలను తీర్చరా
ధగ ధగ ధగ ధగ ధగద్దగిత
సద్ధర్మల సద్బ్రహ్మాండ నాయకా
నిగ నిగ నిగ నిజ రక్తి నిష్యంద
భక్తి భవబంధ ముక్తి దాయకా
గర్జించి జూలు విదిలించి విజృంభించి
మృగములను నిర్చించి నిజము నిగ్గు తేల్ప
వరసింహ వాహనమున అధీష్టించి
నరసింహుడవై చెలరేగెరా
పట పట పటమని దిక్కులు పగలగ
పగతురుల్ పట్టి మట్టు బెట్టగా
పరమ భయంకర ఘోర ఘీంకారా
ప్రకృతి లయంకర పడ గట్టణముల
గజావాహణమున కదలిరా...
ఓం నమో వేంకటేశాయ
ఓం నమో శ్రీనివాసాయ
ఓం నమో వేంకటేశాయ
ఓం నమో శ్రీనివాసాయ
ఓం నమో వేంకటేశాయ
ఓం నమో శ్రీనివాసాయ
ఓం నమో వేంకటేశాయ
ఓం నమో శ్రీనివాసాయ
- బ్రహ్మోత్సవ బ్రహ్మానందము నీకా
Om Namo Venkatesaya
Movie More SongsBrahmothsava Keyword Tags
-
-
-