Song Details
Lyrics
కలియుగ వైకుంఠ పురీ సిరిగల వేంకట గిరీ ఏరి కోరి ఈ గిరిపై వెలసినాడు శ్రీహరీ కలియుగ వైకుంఠ పురీ సిరిగల వేంకట గిరీ ఏరి కోరి ఈ గిరిపై వెలసినాడు శ్రీహరీ బ్రహ్మలోకమున వీణా నాధ లోలుడైన ఆ బ్రహ్మపై భృగువు ఆగ్రహించెను పూజార్హత లేకుండునట్లు శపించెను కైలాసమున కామ తాండవమున మునిగితేలు శివపార్వతులను జూసి శివమెత్తెను భృగువు అంగనా లోళుడా ఇక నీకు లింగ పూజయే జరుగుగాక ఓం నమో నారాయనాయ ఓం నమో నారాయనాయ వైకుంఠమున విష్ణు వైభోగము గాంచి ఎగసి లక్ష్మీ నివాసమౌ హరి ఎదపై తన్నెను మహాపరాధము చేసితి మన్నింపుము నీ పాద సేవా భాగ్యము ప్రసాధింపుము అని భృగుపదముల నదిమెను అజ్ఞాన నేత్రమును చిదిమెను ఈ అవమానమును నేను భరింపలేను భృగుపాదము సోకిన నీ ఎదను నిలువజాలను అని చిటపట లాడుచు సిరి హరిని వీడెను శ్రీ సతి విరహితుడై శ్రీ వైకుంఠ విరక్తుడై ఆదిలక్ష్మినే వెదకుచు అవనికి తరలెను ఆదిలక్ష్మినే వెదకుచు అవనికి తరలెను గోవింద గోవింద గోవింద (4) హరి పాదముద్రల తిరుమల ఆనంద నిలయమాయెను కలియుగ వైకుంఠ పురీ సిరిగల వేంకట గిరీ ఏరి కోరి ఈ గిరిపై శ్రీనివాసుడాయె హరీ గోవిందా - గోవింద (3) పుట్టలోన తపము చేయు పురుషోత్తముడు లక్ష్మీ , లక్ష్మీ అని పరితపించెను హారుడు అజుడు హారుడు అజుడు ఆవు దూడలుగా మారగా క్షితి పతి పై క్షీర ధార కురిసెను గోపాలుడు కోపముతో గొడ్డలి విసిరెను అడ్డుకున్న పరమాత్ముడి పసిడి నుదురు పగిలెను కాలమంతా ఎదురుచూసి కనులు కాయలు కాచెనయ్యా కన్నయ్యా కాలమంతా ఎదురుచూసి కనులు కాయలు కాచెనయ్యా నా కలలు పండగా నా కలలు పండగ అమ్మా యని పిలువ రావయ్యా పిలువ రావయ్యా శ్రీనివాసుడే వకుళకు చిన్ని కృష్ణుడై తోచెను వకుళ మాతృత్వపు మధురిమతో సేదతీర్చెను కలియుగ వైకుంఠ పురీ సిరిగల వేంకట గిరీ ఏరి కోరి ఈ గిరి గోవిందుడాయె శ్రీహరీ గోవిందుడాయె శ్రీహరీ గోవిందా - గోవింద ఆకాశ రాజపుత్రికా అసమ సౌందర్య వల్లిక అరవిరి నగవుల అలరులు కురియుచు ఆటలాడుతూ ఉండగా మత్తగజము తరిమెను బేల మనసు బెదెరెను వేటనాడగా వచ్చిన శ్రీహరి ఎదపై ఒదిగెను గతజన్మల అనుబంధాలేవో రాగవీణలుగ మ్రోగెను అనురాగ రంజితములాయెను వడ్డికాసులిస్తానని కుబేరుణ్ణి వప్పించి అప్పు చేసి పెండ్లి కొడుకు అయ్యే ఆది దేవుడు అంగరంగ వైభవమున అఖిలలోక సమక్షమున పద్మావతి పతి ఆయెను పరంధాముడు సకల సురలు గార్వింపగ శ్రీదేవిని భూదేవిని ఎదను నిలుపు కున్నాడు వెంకటేషుడు ఆపదమొక్కులవాడై... అభయములిచ్చెడివాడై... ఆపదమొక్కులవాడై అభయములిచ్చెడివాడై సప్తగిరుల వెలసినాడు శ్రీనివాసుడు గోవింద గోవింద గోవింద ... గోవిందా - గోవింద ...
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Om Namo Venkatesaya
See AllVeyi Naamaala Vaada
Ramya Behara
Aanandham
Sarath Santhosh, Shweta Pandit
Akhilanda Koti
Sarath Santhosh, Sreenidhi
Brahmanda Bhandamula
M.M. Keeravani
Vayyari Kalahamsika
Revanth, Sunitha Upadrashta
Anda Pinda
Koushik, Mohana Bhogaraju, Sony, Lokeshwar Edara
Maha Padma Sadmey
Saketh
Kamaneeyam
S.P. Balasubrahmanyam
Brahmothsava
Sreenidhi
Pareeksha
Shankar Mahadevan
Govindha Hari Govindha
Sreenidhi, Dhanunjay