MovieGQ

Kamaneeyam

Om Namo Venkatesaya (2017) · Track 9 of 12 · 5:05

Lyrics

కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనమ్మే భూదేవిగా కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం లగ్నమునందే మనసు లగ్నమయేట్టుగా చేకట్టవయ్యా ఇదిగో నీ దీక్షా కంకణం సిరుల అలివేణికి మరుల పూబోనికి కట్టవయ్య స్వామీ దీక్షా కంకణం అదియే పెళ్ళికి అంకురార్పణం కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం అటుకులు తేనేయు కలిపి అనురాగము రంగరించి అటుకులు తేనేయు కలిపి అనురాగము రంగరించి పేరుగన్న పెరుమాళ్లకు పెదవి తీపి చేయరే అన్నుల మిన్నల ముద్దుకు నేడు అలమటించు స్వామి పెదవి తీపి చేయరే రెండు నిండు చందమామలు ఎదుట నున్న సమయం స్వామి ఉల్లమందు ఉప్పొంగెను ఉల్లాసపు సంద్రం తాళలేని తహ తహాలు తలపు దాటి తొంగి చూడా తనకు తానే జారిపోయే తెర చేలము తరలి తరలి తానే వచ్చే సుముహూర్తపు ఆ శుభ సమయం ఇద్దరమ్మలు నీకు చెలిమి ఉన్నారయా అప్పనై ఈ నాడు అప్పగించేనయా లోకాల కప్పడగు వెంకటాద్రీషుడా... స్వామి లోకల కప్పడగు వెంకటాద్రీషుడ లోకువా చేయకు ఇంటి ఇంతులను సృష్టి రక్షణలోనే దృష్టి సాగించకా ఇష్ట సఖులను కూడ ఇంపుగా చూడవయ్యా ఇంపుగా చూడవయ్యా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Om Namo Venkatesaya

See All