MovieGQ

Nanu Palinchaga

Okka Magaadu (2008) · Track 5 of 7

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

పల్లవి: కురులలో కుసుమమై గళములో హారమై పరువానికి పసుపూ కుంకుమై ఆడతనానికి అయిదో తనమై నునుపాలించగ నడిచి వచ్చితివో నను దీవించగ దరికి చేరితివో నీ జాలికి నీ కరుణకీ ఆశీస్సుకి అభయానికి నాకై కదిలిన నీ పాదాలకి ధన్యవాదాలు... ధన్యవాదాలు... నా జన్మ ధన్యవాదాలు నునుపాలించగ నడిచి వచ్చితివో నను దీవించగ దరికి చేరితివో చరణం: 1 మనసా స్మరామి శిరసా నమామి వచసా ధృనామి ఓ... ఓ... నీ సన్నిధిలో పొంగిన వేళ గంగనై నీ సాయమునకు ముగిసిన వేళ యముననై నీ అంతతంగములో ఎగసే తరంగమునై నిలిచే సరస్వతినై ఆ నీటిపూవుతో పన్నీటిపూలతో ధన్యవాదాలు... ధన్యవాదాలు... నునుపాలించగ నడిచి వచ్చితివో నను దీవించగ దరికి చేరితివో చరణం: 2 నీకై చూసేవేళ నా మనసు కనులలో ఉంటుంది నిన్నే పిలిచే వేళ నా మనసు పెదవిలో ఉంటుంది నీకై నడిచే వేళ నా మనసు అడుగులో ఉంటుంది నిన్నే చేరిన వేళ నా మనసు మనసులో ఉంటుంది మనసైన నీకు నీలోని నాకు ధన్యవాదాలు... ధన్యవాదాలు... చరణం: 3 నిను పాలించగ నడిచి వచ్చితిని నిను పూజించగ పతినై చేరితినీ నీ చెలిమికి సుగుణాలకి ఈనాటికి ఏనాటికి నాపై పెట్టిన నీ ప్రాణాలకు ధన్యవాదాలు... ధన్యవాదాలు... ప్రతి జన్మ ధన్యవాదాలు నా జన్మ ధన్యవాదాలు ప్రతి జన్మ ధన్యవాదాలు మనసా స్మరామి శిరసా నమామి వచసా ధృనామి ఓ... ఓ... మనసా స్మరామి శిరసానవామి వచసా ధృనామి ఓ... ఓ...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Okka Magaadu

See All