Song Details
Lyrics
వెళ్ళిపోతే ఎలా మనసా ఎటో అలా అయినా ఎందుకని ఇలా తడబాటు అంతలా తెగ హుషారుగా ఎగిరిపోకే తగని ఊహ వెంట సరైన దారి తెలియందే ఈ ఉరుకులెందుకంట వెళ్ళిపోతే ఎలా... వెళ్ళిపోతే ఎలా... చరణం: 1 ఆమె వలలో చిక్కుకుందా సమయం ప్రేమ లయలో దూకుతోందా హృదయం నేనిప్పుడెక్కడున్నానంటే నాక్కూడా అంతు చిక్కకుంటే గమ్మత్తుగానే ఉన్నాదంటే నాకేదో మత్తు కమ్మినట్టే రమ్మంది గాలి నను చేరి మెరుపు సైగ చేసి చెప్పింది నింగి చెలి దారి చినుకు వంతెనేసి వెళ్ళనంటే ఎలా మనసా అటే అలా వెళ్ళనంటే ఎలా ఎలా... చరణం: 2 తానూ కూడా రాకపోతే నాతో నేను కూడా ఆగిపోనా తనతో నా ప్రాణం ఉంది తన వెంటే నా ఊపిరుంది తననంటే కళ్ళారా చూసానంటూ ఉంటె ఎల్లా నమ్మేది స్వప్నమంటే వెనక్కి వెళ్లి వెతకాలి తిరిగి ఆ క్షణాన్ని మరొక్కసారి చూడాలి కనులు ఆ నిజాన్ని వెళ్ళనంటే ఎలా మనసా అటే అలా వెళ్ళనంటే ఎలా ఎలా...
Lyrics sourced from public databases. May contain errors.