Song Details
Lyrics
నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష బ్రతుకైనా నీతోనే చితికైనా నీతోనే వెతికేది నే నిన్నేనని చెప్పాలని చిన్ని ఆశ ఓ ప్రియతమా... ఓ ప్రియతమా నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష చరణం: 1 పూవుల్లో పరిమళాన్ని పరిచయమే చేసావు తారలలో మెరుపులన్ని దోసిలిలో నింపావు మబ్బులోన చినుకులన్ని మనసులోన కురిపించావు నవ్వుల్లో నవలోకాన్ని నా ముందే నిలిపినావుగా... నీ జ్ఞాపకాలన్నీ ఏ జన్మలోనైనా నే మరవలేనని నీతో చెప్పాలని చిన్ని ఆశ ఓ ప్రియతమా... ఓ ప్రియతమా... నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష చరణం: 2 సూర్యునితో పంపుతున్నా అనురాగపు కిరణాన్ని గాలులతో పంపుతున్నా ఆరాధన రాగాన్ని ఏరులతో పంపుతున్నా ఆరాటపు ప్రవాహాన్ని దారులతో పంపిస్తున్నా అలుపెరుగని హృదయలయలని ఏ చోట నువ్వున్నా నీ కొరకు చూస్తున్నా నా ప్రేమ సందేశం విని వస్తావని చిన్ని ఆశ ఓ ప్రియతమా...ఓ ప్రియతమా...
Lyrics sourced from public databases. May contain errors.