MovieGQ

Ghaatu Ghaatu Prema

Okariki Okaru (2003) · Track 5 of 6

Song Details

Lyrics

ఘాటు ఘాటు ప్రేమ - నీకు నాకు నడుమ ఘాటు ఘాటు ప్రేమ ఈ ఘాటు చాలదమ్మా నీకు నాకు నడుమ ఈ దూరమేమిటమ్మా చేరానుగా ఓకే మరి - ఈ చేరువ సరిపోదేమరి నాలో నువ్వు నీలో నేను ఇంకా ఇంకా ఉండాలంటే ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి... ఘాటు ఘాటు ప్రేమ ఈ ఘాటు చాలదమ్మా నీకు నాకు నడుమ ఈ దూరమేమిటమ్మా చరణం: 1 చూడు - నిను చూసినకొద్దీ చూడందేదో చూడాలంటూ బ్రతిమాలుతుంది వయసు చెప్పు - అని పలికిన కొద్దీ చెప్పందేదో చెప్పాలంటూ చెలరేగుతోంది మనసు నా పసిడి ప్రాయాలు ఒంపినా... నా పట్టపగ్గాలు తెంపినా... నువ్వో సగమై నేనో సగమై ఇద్దరమొకటై ఉండాలంటే ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి... ఘాటు ఘాటు ప్రేమ ఈ ఘాటు చాలదమ్మా నీకు నాకు నడుమ ఈ దూరమేమిటమ్మా చరణం: 2 ముద్దు - నువ్వు పెట్టిన కొద్దీ దాహం పెరిగి దావనలమై నను కాల్చుతుంది ఒట్టు పట్టు - నువ్వు పట్టిన కొద్దీ మత్తుగా నాలో కమ్మిన మైకం ఎక్కింది ఆఖరి మెట్టు కౌగిళ్ళ లోగిళ్ళు చేరినా... సరసాల శిఖరాలు తాకినా... నేనే నువ్వై నువ్వే నేనై నువ్వు నేను ఉండాలంటే ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి... ఘాటు ఘాటు ప్రేమ... నీకు నాకు నడుమ...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Okariki Okaru

See All