Song Details
Lyrics
ముత్యమంతా పసుపు ముఖమెంతో చాయ ముత్తైదు కుంకుమ బతుకంత చాయ ముత్యమంతా పసుపు ముఖమెంతో చాయ ముత్తైదు కుంకుమ బతుకంత చాయ ముద్దు మురిపాలొలుకు ముంగిళ్ళలోన మూడు పువ్వులు ఆరు కాయల్లు కాయ ముత్యమంతా పసుపు ముఖమెంతో చాయ ముత్తైదు కుంకుమ బతుకంత చాయ చరణం: 1 ఆరనైదోతనము ఏ చోటనుండు అరుగులలికే వారి అరచేతనుండు ఆరనైదోతనము ఏ చోటనుండు అరుగులలికే వారి అరచేతనుండు తీరైన సంపద ఎవరింటనుండు తీరైన సంపద ఎవరింటనుండు దినదినము ముగ్గున్న లోగిళ్ళనుండు ముత్యమంతా పసుపు ముఖమెంతో చాయ ముత్తైదు కుంకుమ బతుకంత చాయ చరణం: 2 కోటలో తులసమ్మ కొలువున్న తీరు కోరి కొలిచే వారి కొంగు బంగారు కోటలో తులసమ్మ కొలువున్న తీరు కోరి కొలిచే వారి కొంగు బంగారు గోవు మాలక్ష్మికి కోటి దండాలు గోవు మాలక్ష్మికి కోటి దండాలు కోరినంత పాడి నిండు కడవల్లు ముత్యమంతా పసుపు ముఖమెంతో చాయ ముత్తైదు కుంకుమ బతుకంత చాయ చరణం: 3 మగడు మెచ్చిన చాన కాపురంలోన మొగలి పూల గాలి ముత్యాల వాన మగడు మెచ్చిన చాన కాపురంలోన మొగలి పూల గాలి ముత్యాల వాన ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం ఇంటిల్లిపాదికి అంత వైభోగం ముత్యమంతా పసుపు ముఖమెంతో చాయ ముత్తైదు కుంకుమ బతుకంత చాయ ముద్దు మురిపాలొలుకు ముంగిళ్ళలోన మూడు పువ్వులు ఆరు కాయల్లు కాయ ముత్యమంతా పసుపు ముఖమెంతో చాయ ముత్తైదు కుంకుమ బతుకంత చాయ
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Muthyala Muggu
See AllSri Rama Jaya Rama
M. Balamuralikrishna
Gogulu Puche Gogulu Puche O Lacha Gummadu
S.P. Balasubrahmanyam, P. Susheela
Yedho Yedho Annadhi
V. Ramakrishna
Sri Raghavam Dasharadhathmaja Maprameyam
M. Balamuralikrishna
Yenthati Rasikudavo
P. Susheela
Nidhurinche Thotaloki Pata Okati Vacchindhi
P. Susheela