MovieGQ

Gogulu Puche Gogulu Puche O Lacha Gummadu

Muthyala Muggu (1975) · Track 3 of 7

Lyrics

గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చ గుమ్మాడి గోగులు దులిపే వారెవరమ్మ ఓ లచ్చ గుమ్మాడి గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చ గుమ్మాడి గోగులు దులిపే వారెవరమ్మ ఓ లచ్చ గుమ్మాడి ఓ లచ్చ గుమ్మాడి ఓ లచ్చ గుమ్మాడి పొద్దు పొడిచే పొద్దు పొడిచే ఓ లచ్చ గుమ్మాడి పుత్తడి వెలుగులు కొత్తగ మెరిసే ఓ లచ్చ గుమ్మాడి పొద్దు కాదది నీ ముద్దు మోమున దిద్దిన కుంకుమ తిలకమే సుమా పొద్దు కాదది నీ ముద్దు మోమున దిద్దిన కుంకుమ తిలకమే సుమా వెలుగులు కావవి నీ పాదాలకు అలదిన పారాణి జిలుగులే సుమా చరణం: 1 ముంగిట వేసిన ముగ్గులు చూడు ఓ లచ్చ గుమ్మాడి ముత్యాల ముగ్గులు చూడు ఓ లచ్చ గుమ్మాడి ముంగిలి కాదది నీ అడుగులలో పొంగిన పాల కడలియే సుమా ముంగిలి కాదది నీ అడుగులలో పొంగిన పాల కడలియే సుమా ముగ్గులు కావవి నా అంతరంగాన పూచిన రంగవల్లులే సుమా చరణం: 2 మల్లెలు పూచే మల్లెలు పూచే ఓ లచ్చ గుమ్మాడి వెన్నెల కాచే వెన్నెల కాచే ఓ లచ్చ గుమ్మాడి మల్లెలు కావవి నా మహాలక్ష్మి విరజల్లిన సిరినవ్వులే సుమా మల్లెలు కావవి నా మహాలక్ష్మి విరజల్లిన సిరినవ్వులే సుమా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Muthyala Muggu

See All