Song Details
Lyrics
రావు గారి అబ్బాయి యాక్టర్ అవ్వాలన్నాడు కానీ వాళ్ళ బాబేమో డాక్టర్నే చేశాడు పైసలెన్నో వస్తున్నా పేషెన్ట్ లా ఉంటాడు సూపర్ స్టార్ అవ్వాల్సినోడు సూది మందు గుచ్చుతున్నాడు నీకు నచ్చింది చెయ్యకుంటే లైఫ్ లో యాడుంది కిక్కు నిన్నే నువ్వు నమ్ముకుంటే నీకింక ఎవడు దిక్కు Be whats u wanna be Do whats u wanna do say whats u wanna say లేదంటే లైఫ్ అంతా నరకం నిజమేరా ఏదో నిన్ను ఫాలో అవ్వడం వల్ల ఇలా ఉన్నాను గాని లేకపోతే ఆ లక్ష్మీ గారి అమ్మాయిలా లైఫ్ లో లైఫె లేకుండా పోయేదిరా బాబు ఆ లక్ష్మీ గారి అమ్మాయి - బాగుంటదా ముందు మేటర్ వినరా సన్నాసి ఆ లక్ష్మీ గారి అమ్మాయి డాన్సరవ్వాలనుకుంది ఓహో కానీ వాళ్ళ అమ్మేమో పెళ్ళి చేసి పంపేసింది వందకోట్ల ఆస్తున్నా వంటింట్లోనే ఉంటాది గజ్జకట్టా లనుకున్నాది గరిట పట్టుకున్నాది ఎవడో చెప్పింది చేస్తుంటే లైఫ్ లో యాడుంది కిక్కు ఎపుడు నువ్వే సర్దుకుపోతే నీకింక ఎవడు దిక్కు Be whats u wanna be Do whats u wanna do say whats u wanna say లేదంటే లైఫ్ అంతా నరకం మన జనరేషన్ కే కాదురా మన ముందు జనరేషన్ కి కూడా ఇదే టార్చరు అంతెందుకు మన శీను గాడి బాబాయి శీను గాడి బాబాయి లీడరవ్వాలన్నాడు కానీ వీడి తాతేమో ప్లీడర్ని చేశాడు కేసు వాడివైపున్నా పేస్ మాడినట్టుంటాడు జిందాబాద్ వినాల్సినోడు జడ్జ్ ముందు తల వంచాడు నువ్వనుకున్నది చెప్పుకుంటే లైఫ్ లో యాడుంది కిక్కి నీలో నువ్వే గింజుకుంటే నీకింక ఎవడు దిక్కు Be whats u wanna be Do whats u wanna do say whats u wanna say లేదంటే లైఫ్ అంతా నరకం రేయ్ పెద్దవాళ్ళు చెబుతారు పక్కనోళ్ళు చెబుతారు తప్పులేదు బాసు వాళ్లకు తోచిందే చెబుతారు నువ్వు కోరుకుందేంటో నీకు ఏది సూటవుతుందో అర్ధమయ్యేలా చెప్పకుంటే వాళ్ళు మాత్రమేం చేస్తారో మనమే క్లియర్ గా లేకపోతె అక్కడే వస్తుంది చిక్కు లేనిపోని భయాలు పెట్టుకుంటే తర్వాత మీకు బిక్కు Be whats u wanna be Do whats u wanna do say whats u wanna say లేదంటే లైఫ్ అంతా నరకం
Lyrics sourced from public databases. May contain errors.