Song Details
Lyrics
హా చలిచలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది నీవైపే మళ్లిందీ మనసూ చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది సతమతమై పోతుందీ వయసూ చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఏవేవో గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి పోతున్నాయి చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయి నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు నన్నే చూస్తున్నట్టు ఊహలు నువ్వు నా వూపిరైనట్టు నాలోపలున్నట్టు ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు హా చలిచలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది నీవైపే మళ్లిందీ మనసూ చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది సతమతమై పోతుందీ వయసూ చరణం: 1 గొడవలతో మొదలై తగువులతో బిగువై పెరిగిన పరిచయమే నీదీ నాదీ తలపులు వేరైనా కలవని తీరైనా బలపడిపోతుందే ఉండేకొద్దీ లోయలోకి పడిపోతున్నట్టు ఆకాశంపైకి వెళుతున్నట్టు తారలన్ని తారసపడినట్టు అనిపిస్తుందే నాకు ఏమైనట్టు నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు నన్నే చూస్తున్నట్టు ఊహలు నువ్వు నా వూపిరైనట్టు నాలోపలున్నట్టు ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు చరణం: 2 నీపై కోపాన్ని ఎందరిముందైనా బెదురే లేకుండా తెలిపే నేను నీపై ఇష్టాన్ని నేరుగ నీకైనా తెలపాలనుకుంటే తడబడుతున్నాను నాకు నేనే దూరం అవుతున్నా నీ అల్లరులన్నీ గురుతొస్తుంటే నన్ను నేనే చేరాలనుకున్నా నా చెంతకి నీ అడుగులు పడుతూ ఉంటే నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు నన్నే చూస్తున్నట్టు ఊహలు నువ్వు నా వూపిరైనట్టు నాలోపలున్నట్టు ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు
Lyrics sourced from public databases. May contain errors.