Song Details
Lyrics
ఎప్పటికి తన గుప్పెట విప్పదు ఎవ్వరికి తన గుట్టలు చెప్పదు ఎందుకిలా ఎదురైనది పొడుపుకథ తప్పుకునేందుకు దారిని ఇవ్వదు తప్పు అనేందుకు కారణముండదు చిక్కులలో పడడం తనకేం సరదా బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా కలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా నిన్న మొన్నా నీ లోపల కలిగిందా ఏనాడైనా కల్లోలం ఇలా ఈ రోజు ఏమైందని ఏదైనా అయ్యిందని నీకైనా కాస్తైనా అనిపించిందా రా ఎప్పటికి తన గుప్పెట విప్పదు ఎవ్వరికి తన గుట్టలు చెప్పదు ఎందుకిలా ఎదురైనది పొడుపుకథ తప్పుకునేందుకు దారిని ఇవ్వదు తప్పు అనేందుకు కారణముండదు చిక్కులలో పడడం తనకేం సరదా ఏదోలా చూస్తారే నిన్నొ వింతలా నిన్నే నీకు చూపుతారే పోల్చలేనంతగా మునపటిలా లేవంటూ కొందరు నిందిస్తూ ఉంటే నిజమో కాదో స్పష్టంగా తేలేదెలా సంబరపడి నిన్ను చూపిస్తూ కొందరు అభినందిస్తుంటే నవ్వాలో నిట్టూర్చాలో తెలిసేదెలా బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా కలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా నీ తీరే మారింది నిన్నకి నేటికి నీ దారే మల్లుతుందా కొత్త తీరానికి మార్పేదైన వస్తుంటే నువ్వది గుర్తించక ముందే ఎవరెవరో చెబుతూ ఉంటే నమ్మేదెలా వెళ్ళే మార్గం ముళ్ళుంటే ఆ సంగతి గమనించందే తొందరపడి ముందడుగేసే వీలేలేదా బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా కలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా
Lyrics sourced from public databases. May contain errors.