MovieGQ

Pandagala

Mirchi (2013) · Track 4 of 7

Song Details

Singer
Music Director

Lyrics

పండగలా దిగివచ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్నే ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు పండగలా దిగివచ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్నే ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు అయ్యంటే ఆనందం అయ్యంటే సంతోషం మా అయ్యకు అయ్యై నీవు కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం ఇట్టాగే పదికాలాలు ఉండనివ్వు పండగలా దిగివచ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్నే ఎరుపెక్కించావు ఓ మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు ఓ జోలాలి అనలేదే చిననాడు నిన్నెపుడూ ఈ ఊరి ఉయ్యాలా ఓ నీ పాదం ముద్దాడి పులకించి పోయిందే ఈ నేల ఈయాలా మా పల్లె బతుకుల్లో మా తిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాలా ఓ మా పిల్ల పాపల్లో మా ఇంటి దీపాల్లో నీ నవ్వే చూడాలా గుండె కలిగిన గుణము కలిగిన అయ్యా కొడుకువుగా వేరు మూలము వెతికి మా జత చేరినావు ఇలా పండగలా దిగివచ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్నే ఎరుపెక్కించావు ఓ మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు ఓ పెదవుల్లో వెన్నెళ్ళు గుండెల్లో కన్నీళ్ళు ఇన్నాళ్లు ఇన్నేళ్ళు ఓ అచ్చంగా నీవల్లే మా సామి కళ్ళల్లో చుశామీ తిరనాళ్లు ఏ దైవం పంపాడో నువ్వొచ్చిన వెలుగుల్లో మురిశాయి ముంగిల్లు మా పుణ్యం పండేలా ఈ పైన మేమంతా మీ వాళ్ళు అయినోళ్ళు అడుగు మోపిన నిన్ను చూసి అదిరె పలనాడు ఇక కలుగు దాటి బయట పడగా బెదరడా పగవాడు పండగలా దిగివచ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్నే ఎరుపెక్కించావు ఓ మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Mirchi

See All