MovieGQ

Ninnatidhaka Silanaina Nee Padhamu Soki Ne Gowthaminaina

Megha Sandesam (1982) · Track 8 of 16

Song Details

Lyrics

నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా నీ మమతావేశపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతు ఉన్నా నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా సరస సరాగాల సుమ రాణిని స్వరస సంగీతాల సారంగిని సరస సరాగాల సుమ రాణిని స్వరస సంగీతాల సారంగిని మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుక మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుక మవ్వంపు నటనాల మాతంగిని కైలాస శిఖరాల శైలూశిఖా నాట్య ఢోలలూగేవేళ రావేల నన్నేల నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా నీ మమతావేశపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతూ ఉన్నా నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా నిన్నే ఆరాధించు నీ దాసిని ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని నిన్నే ఆరాధించు నీ దాసిని ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే చిరునవ్వులో నేను సిరి మల్లిని స్వప్న ప్రపంచాల సౌందర్య దీపాలు చెంత వెలిగేవేళ ఈ చింత నీకేల నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా నీ మమతావేశపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతు ఉన్నా నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Megha Sandesam

See All