Song Details
Lyrics
విధి చేయు వింతలన్నీ మతిలేని చేతలేనని విరహాన వేగిపోయి విలపించే కధలు ఎన్నో(2) విలపించే కధలు ఎన్నో... చరణం: 1 ఎదురు చూపులు ఎదను పిండగా ఏళ్ళు గడిపెను శకుంతల విరహ బాధను మరిచిపోవగా నిదురపోయెను ఊర్మిళ అనురాగమే నిజమని మనసొకటి దాని ఋజువని తుది జయము ప్రేమదేయని బలి అయినవి బ్రతుకులెన్నో... చరణం: 2 వలచి గెలిచి కలలు పండిన జంట లేదీ ఇలలో కులమో మతమో ధనమో బలమో గొంతు కోసెను తుదిలో అది నేడు జరుగ రాదనీ ఎడబాసి వేచినాము మన గాధే యువతరాలకు కావాలి మరోచరిత్ర కావాలి మరోచరిత్ర
Lyrics sourced from public databases. May contain errors.