Song Details
Lyrics
పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు(2) వెన్నెలల్లె విరియబూచి వెల్లువల్లే ఉరకలేసే పదహారేళ్ళకు .... చరణం: 1 పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు పాటలు పాడిన చిరుగాలులకు తెరచాటొసగిన చెలులు శిలలకు(2) దీవెన జల్లులు చల్లిన అలలకు కోటి దండాలు శత కోటి దండాలు... చరణం: 2 నాతో కలిసి నడచిన కాళ్ళకు నాలో నిన్నే నింపిన కళ్ళకు నిన్నే పిలిచే నా పెదవులకు నీకై చిక్కిన నా నడుమునకు కోటి దండాలు శత కోటి దండాలు.. చరణం:బి3 భ్రమలో లేపిన తొలి జాములకు సమయం కుదిరిన సందె వేళలకు నిన్ను నన్ను కన్నవాళ్ళకు(2) మనకై వేచే ముందు నాళ్ళకు..
Lyrics sourced from public databases. May contain errors.