MovieGQ

Na Manasune

Manmadhudu (2002) · Track 5 of 6

Lyrics

నా మనసునే మీటకే నేస్తమా నా దారిలో చేరకే చైత్రమా సరదాల చిలిపి తనమా చిరునవ్వులోని స్వరమా నా తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమా నా మనసునే మీటకే నేస్తమా నా దారిలో చేరకే చైత్రమా... చరణం: 1 నా కెందుకిలా అవుతోంది చెప్పవా ఒక్కసారి నీ వెంటపడే ఆశలకి చూపవా పులదారి చినుకల్లే చేరి వరదల్లే మారి ముంచేస్తే తేలేదెలాగ తడిజాడ లేని తమ గుండెలోని దాహాలు తీరేదెలాగ లేనిపోని సయ్యాటతో వెంటాడకే ప్రేమా... నీ కనులలో వెలగనీ ప్రియతమా... నీ పెదవికే తెలుపనీ మధురిమా.... చరణం: 2 నీ ఊహలలో కొంటెతనం పలకరిస్తోంది నన్ను.... నీ ఊపిరితో అల్లుకుని పులకరిస్తోంది వెన్ను... అలవాటుపడిన ఎద చీకటింట సరికొత్త వేకువై రావా.... కిరణాలు పడని తెరచాటులోని ఏకాంతమే వదులుకోవా... నన్ను నేను మరిచేంతలా మురిపించకే ప్రేమా.... నీ... కనులలో... వెలగనీ... ప్రియతమా... నీ... పెదవికీ... తెలుపనీ... మధురిమా... సరదాల చిలిపి తనమా చిరునవ్వులోని స్వరమా నా తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Manmadhudu

See All