MovieGQ

Don’t Marry Be Happy

Manmadhudu (2002) · Track 4 of 6

Lyrics

హా... శభాష్... స గ మ పా నీ ప ... మ ప గా ... రీ స నీ పా... మ ప నీ సా... రేయ్ వద్దురా...సోదరా... అరె పెళ్ళంటే నూరేళ్ళమంటరా... ఆదరా... బాదరా... నువ్వెళ్ళిళ్లి గోతిలో పడొద్దురా రేయ్... వద్దురా... వద్దు, వద్దురా సోదరా అరె పెళ్ళంటే నూరేళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వెళ్ళిళ్లి గోతిలో పడొద్దురా చెడిపోవద్దు బ్రహ్మచారీ పడిపోవద్దు కాలుజారీ తాళికట్టొద్దు ఖర్మకాలి ఆలి అంటేనే భద్రకాళి కళ్యాణమే ఖైదురా జన్మంత విడుదల లేదురా నీకొంప ముంచేస్తుందిరా ఆపుకోలేని ఈ తొందర Don't marry be happy (4) వద్దురా సోదరా అరె పెళ్ళంటే నూరేళ్ళమంటరా ఆదరా బాదరా నువ్వెళ్ళిళ్లి గోతిలో పడొద్దురా అ అ ఆ శివ అని నా క్లోజ్ ఫ్రెండ్, లవ్ లో పడి పెళ్ళి చేసుకున్నాడు కాలేజీలో వాడు గ్రీకు వీరుడు మ్యారేజీ కాకముందు రాకుమారుడు అంతా జరిగి జస్ట్ వన్ మంత్ కాలేదు ఎంతమారిపోయాడో గుర్తుపట్టలేనట్టు బక్క చిక్కిపోయి మంచి లుక్కు పోయి ఫేసు పాలిపోయి జుట్టు రాలిపోయి ఈ దేవదాసు వాలకం దేనికంటే తను దేవిదాసు కావడం వల్ల అంటు గుక్కపెట్టి ఏడ్చాడు ముక్కు చీదుకున్నాడు ఒక్క చుక్క మందుకొట్టి ఫ్లాష్ బాక్ చెప్పాడు పొద్దున్నలేస్తున్న లేస్తునే తన అందాన్ని పొగడాలి మరి ఏపూటకాపూటే తనకైలవ్యూ చెప్పాలి ఏం కోరినా తక్షణం తీర్చాలిరా ఆ వరం కత్తి సామైందిరా కాపురం పెళ్ళి క్షమించరాని నేరం Don't marry be happy (4) వద్దురా సోదరా అరె పెళ్ళంటే నూరేళ్ళమంటరా ఆదరా బాదరా నువ్వెళ్ళిళ్లి గోతిలో పడొద్దురా వద్దుర వద్దు అంతెందుకు మా మల్లిగాడు మా ఊళ్ళో వాడంతటోడు లేడు మామూలుగానే వాడు దేశముదురు పెళ్ళితోటె పోయింది వాడి పొగరు ఇల్లాలు అమ్మోరు పడ్లేక ఇంటిపోరు చల్లారిపోయింది వాడినెత్తురు ఒక్కపుట కూడా ఉండదనుకుంటా కస్సుమనకుండా బుర్రతినకుండా వాడ్ని తిట్టింతిట్టు తిట్టకుండా వెంటపడి తరుముతునే ఉంటదట వీధివెంట కోడెనాగు లాంటి వాడ్ని వానపాము చేసింది ఆలికాదురా అది అనకొండ ఆ గయ్యాలి యమగోల కలిగించిందిభక్తి యోగం ఆ ఇల్లాలి దయవల్ల కనిపించింది ముక్తి మార్గం సంసారమే వేస్టని ఇక సన్యాసమే బెస్టని కాషాయమే కట్టాడురా కట్టి కాశీకి పోయాడురా Don't marry be happy (4) వద్దురా సోదరా అరె పెళ్ళంటే నూరేళ్ళమంటరా ఆదరా బాదరా నువ్వెళ్ళిళ్లి గోతిలో పడొద్దురా Don't marry be happy (4)

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Manmadhudu

See All