Song Details
Lyrics
చెలియా చెలియా చెయిజారి వెళ్ళకే సఖియా సఖియా... వంటరిని చెయ్యకే నడి రేయి పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా ఎదమాటేబాటై రానానీదాకా పడి లేచే కెరటం తీరుగా దిశలన్నీ దాటే హోరుగా నినుతాకేదాకా ఆగదు నాకేకా చెలియా చెలియా చెయిజారి వెళ్ళకే సఖియా సఖియా... వంటరిని చెయ్యకే నడి రేయి పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా ఎదమాటేబాటై రానానీదాకా చరణం: 1 కదలికే తెలియని శిలని కదిలించి ఓ ప్రేమా కలయికే కల అని మాయమైపోకుమా గతముగా మిగిలిన చితిని బతికించి ఓ ప్రేమా చెరిపినా చెరగని గాయమైపోకుమా మౌనమా అభిమానమా పలకవా అనురాగమా ఓడిపోకే ప్రాణమా వీడిపోకుమా అడుగడుగు తడబడుతు నిను వెతికి వెతికి కనులు అలిసిపోవాలా చెలియా చెలియా చెయిజారి వెళ్ళకే సఖియా సఖియా... వంటరిని చెయ్యకే చరణం: 2 నిలిచిపో సమయమా తరమకే చెలిమి ఇకనైనా చెలిమితో సమరమా ఇంతగా పంతమా నిలవకే హృదయమా పరుగు ఆపొద్దు క్షణమైనా నమ్మవేం ప్రణయమా అంత సందేహమా వేరుచేసే కాలమా చేరువైతే నేరమా దాడి చేసే దూరమా దారి చూపుమా విరహాలే కరిగేలా జత కలిపి నడుపు వలపు కథలు గెలిచేలా చెలియా చెలియా చెయిజారి వెళ్ళకే సఖియా సఖియా... వంటరిని చెయ్యకే నడి రేయి పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా ఎదమాటేబాటై రానానీదాకా పడి లేచే కెరటం తీరుగా దిశలన్నీ దాటే హోరుగా నినుతాకేదాకా ఆగదు నాకేకా
Lyrics sourced from public databases. May contain errors.