Song Details
Lyrics
గుండెల్లో ఏముందో... కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం... నీపేరే పిలుస్తోంది నిలవదు కద హృదయం... నువు ఎదురుగ నిలబడితే కదలదు కద సమయం... నీ అలికిడి వినకుంటే కలవరమో తొలివరమో తెలియని తరుణమిది! గుండెల్లో ఏముందో... కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం... నీపేరే పిలుస్తోంది మనసా మనసా మనసా మనసా మనసా మనసా మనసా మనసా మనసా... ఓ మనసా...! చరణం: 1 పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నది నువ్వు ఇపుడన్నది నేనెప్పుడూ విననిది నిన్నిలా చూసి పయనించి వెన్నెలే చిన్నబోతోంది కన్నులే దాటి కలలన్నీ ఎదురుగా వచ్చినట్టుంది ఏమో... ఇదంతా... నిజంగా కలలాగే ఉంది! గుండెల్లో ఏముందో... కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం... నీపేరే పిలుస్తోంది చరణం: 2 ఎందుకో తెలియని... కంగారు పుడుతున్నది ఎక్కడా జరగని... వింతేమి కాదే ఇది పరిమళం వెంట పయనించే పరుగు తడబాటు పడుతోంది పరిణయం దాక నడిపించీ పరిచయం తోడు కోరింది దూరం తలొంచే ముహూర్తం ఇంకెపుడొస్తుంది! గుండెల్లో ఏముందో... కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం... నీపేరే పిలుస్తోంది నిలవదు కద హృదయం...నువు ఎదురుగ నిలబడితే కదలదు కద సమయం... నీ అలికిడి వినకుంటే కలవరమో తొలివరమో తెలియని తరుణమిది! మనసా మనసా మనసా మనసా మనసా మనసా మనసా మనసా మనసా... ఓ మనసా...!
Lyrics sourced from public databases. May contain errors.