Song Details
Lyrics
ఎంతా టక్కరివాడు నా రాజు ఏ మూలనోనక్కి నాడు ఎంతా టక్కరివాడు నా రాజు ఏ మూలనోనక్కి నాడు వంటచేను గట్టు మీద వంటిగ నే పోతుంటే వెంట వచ్చినట్టులున్నది ఎవరో వెనకనిలిచినట్టులున్నది వెంట వచ్చినట్టులున్నది ఎవరో వెనకనిలిచినట్టులున్నది గుబులు గుబులుగా గుండె ఝల్లుమని గుబులు గుబులుగా గుండె ఝల్లుమని బిక్కు బిక్కుమని చూశాను ఫక్కున పక్కనినవ్వేను ఎవరూ?... నానీడ! ఎంతా టక్కరివాడు నా రాజు ఏ మూలనోనక్కి నాడు పొర్లిపారు ఏటి లోన బుటుకు బుటుకుమునుగుతుంటే బుగ్గ తాకినట్టులున్నది ఎవరో పైటలాగినట్టులున్నది గిలిగింతలు పెట్టినట్లు ఒడలంతాపులకరించే నీళ్ళంతా వెదికినాను త్రుల్లి త్రుల్లిపారిపోయేనూ ఎవరూ?... చేప! ఎంతా టక్కరివాడు నా రాజు ఏ మూలనోనక్కి నాడు అర్థరాత్రి వేళ నేను ఆదమరచి నిదురపోతే వద్ద చేరినట్టులున్నది ఎవరోముద్దులాడినట్టులున్నది వద్ద చేరినట్టులున్నది ఎవరోముద్దులాడినట్టులున్నది చిక్కినాడు దొంగయనుకొని చేయి చాచిపట్టబోతే కంటి కేమి కానరాక కరిగి కరిగి పోయేను ఎవరూ?...కల! ఎంతా టక్కరివాడు నా రాజు ఏ మూలనోనక్కి నాడు ఎంతా టక్కరివాడు నా రాజు ఏ మూలనోనక్కి నాడు
Lyrics sourced from public databases. May contain errors.