Song Details
Lyrics
అహో... ఆంధ్ర భోజా శ్రీ కృష్ణ దేవరాయా విజయ నగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా ఈ శిధిలాలలో చిరంజీవివైనావయా శిలలపై శిల్పాలు చెక్కినారు శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు కనుచూపు కరువైన వారికైనా కనుచూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కలిగించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు ఒకవైపు ఉర్రూతలూపు కవనాలు ఒకప్రక్క ఉరికించు యుద్ధ భేరీలు ఒకచెంప శృంగార మొలుకు నాట్యాలు నవరసాలోలికించు నగరానికొచ్చాము కనులు లేవని నీవు కలత పడవలదు కనులు లేవని నీవు కలత పడవలదు నా కనులు నీవిగా చేసుకుని చూడు శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు ఏక శిల రధముపై లోకేశు ఒడిలోన ఓరచూపుల దేవి ఊరేగి రాగా ఏక శిల రధముపై లోకేశు ఒడిలోన ఓరచూపుల దేవి ఊరేగి రాగా రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి సరిగమా పదనిస స్వరములే పాడగా కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు కొడుకు పుట్టాలనీ కోరుతున్నారనీ శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు రాజులే పోయినా రాజ్యాలు కూలినా కాలాలు మారినా గాడ్పులే వీచినా మనుజులే దనుజులై మట్టి పాల్జేసినా చెదరనీ కదలనీ శిల్పాల వలెనే నీవు నా హౄదయాన నిత్యమై సత్యమై నిలిచి వుందువు చెలీ నిజము నా జాబిలీ !
Lyrics sourced from public databases. May contain errors.