Song Details
Lyrics
త్యాగం ఇదియేనా ? హృదయం శిల ఏనా ? ఏల ఈ మోసం ? (2) ఇల్లాలి మనసే కల్లోలమాయె ఏలా, ఈ మోసం ఏదీ నీ హృదయం ? నీవు కట్టిన తాళి నిగనిగ మెరిసేను కనికరమున గాజులు కరముల వెలిగెను ఆనాటి పారాణి ఆనవాలు మిగిలేను ఆ జాలి, ఆ మమత నీకు లేక పోయేనా? ఏదీనీ హృదయం ? నిలువనీడ నిచ్చావు నగలు చీరెలిచ్చావు అంతూ పొంతూ లేని ఆశలు కలిగించావు భాధ్యత అంతతో తీరెనని తలచావా? భాధ్యత అంతతో తీరెనని తలచావా? అంతేనా... అంతేనా ? చదివిన నీ చదువంతా వ్యర్ధమా ? ఏదీ నీ హృదయం ? రేయి పవలు కంటికి రెప్పగా మేను మనసుమాటా ఒక్కటిగా జీవితమంతా చెంత నిలిచి ఉండాలి త్యాగమదే... త్యాగమదే... మూడు ముళ్ళు వేయుటయే త్యాగ మనితలచితివా ఏదీ నీ హృదయం త్యాగం ఇదియేనా ? హృదయం శిలఏనా ఏల ఈ మోసం ? కలకమ్టి కంట కన్నీరోలికినచో... గరలమైపొవును అమృతమే మరువకుమా... కన్నులున్న అంధుడవై బాధలు పడ నేలా..? కనులు లెలీ ధీనురాలి గాధలు వినలేవా...? మగువను నీ దానిని చేసుకో మనసును నీదారికి తీసుకో మానవ రూపంలో దేవునిగా మారిపో !
Lyrics sourced from public databases. May contain errors.