MovieGQ

Oho Oho Pavurama Vayyari Pavurama

Manchi Manasulu (1962) · Track 7 of 7

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

ఓహో.. ఓహో.. ఓహో.. ఓహో పావురమా వయ్యారి పావురమా ఓహో.. ఓహో పావురమా వయ్యారి పావురమా మావారి అందాలు నీవైన తెలుపమా మావారి అందాలు నీవైన తెలుపమా ఓహో.. ఓహో పావురమా వయ్యారి పావురమా మనసు మధురమైనది మమతలు నిండినది సొగసు నెనెరుగనిది చూడాలని ఉన్నది మనసు మధురమైనది మమతలు నిండినది సొగసు నెనెరుగనిది చూడాలని ఉన్నది అరువుగ నీ కనులు కరుణతో ఇవ్వగలవా ? అరువుగ నీ కనులు కరుణతో ఇవ్వగలవా ? కరువు తీర ఒక్కసారి కాంతునమ్మ వారినీ.. ఓహో.. ఓహో.. ఓహో.. ఓహో పావురమా వయ్యారి పావురమా వలపు కన్న తీయని పలుకులు వారివి తలుచుకున్న చాలును పులకరించు నా మేను వలపు కన్న తీయని పలుకులు వారివి తలుచుకున్న చాలును పులకరించు నా మేను మగసిరి దొరయని మరునికి సరియని మగసిరి దొరయని మరునికి సరియని అందరు అందురే అంత అందమైన వారా.. ఓహో.. ఓహో.. ఓహో.. ఓహో పావురమా వయ్యారి పావురమా అందరి కన్నులు అయ్యగారిమీదనే దిష్టి తగల గలదనీ తెలిపిరమ్మ కొందరు అన్నది నిజమేనా అల్లిన కథలేనా ? అన్నది నిజమేనా అల్లిన కథలేనా ? కన్నులున్న నీవైనా ఉన్నమాట చెప్పుమా... ఓహో.. ఓహో.. ఓహో.. ఓహో పావురమా వయ్యారి పావురమా మావారి అందాలు నీవైన తెలుపమా మావారి అందాలు నీవైన తెలుపమా ఓహో.. ఓహో పావురమా వయ్యారి పావురమా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Manchi Manasulu

See All