Song Details
Lyrics
మావా మావా మావా మావా మావా మావా ఏమే ఏమే భామా ఏమే ఏమే భామా పట్టుకుంటే కందిపోవు పండు వంటి చిన్నదుంటే చుట్టు చుట్టుతిరుగుతారు మర్యాదా? తాళి కట్టకుండ ముట్టుకుంటే తప్పుకాదా? మావా మావా మావా మావా మావా మావా వాలువాలు చూపులతో గాలమేసి లాగిలాగి ప్రేమలోకి దింపువాళ్లు మీరు కాదా? చెయ్యి వెయ్యబోతే బెదురుతారు వింతగాదా? ఏమే ఏమే భామా ఏమే ఏమే భామా నీవాళ్లు నావాళ్లు రాకనే మనకు నెత్తిమీద అక్షింతలు పడకనే నీవాళ్లు నావాళ్లు రాకనే మనకు నెత్తిమీద అక్షింతలు పడకనే సిగ్గు దాచి... ఓహో... సిగ్గు దాచి ఒకరొకరు సిగను పూలు కట్టుకొని టింగు రంగయంటు ఊరు తిరుగొచ్చునా లోకం తెలుసుకోక మగవాళ్లు మెలగొచ్చునా మావా మావా మావా మావా మావా మావా హోయ్ హోయ్ హోయ్ హోయ్ హోయ్ హోయ్ కళ్లు కళ్లు కలుసుకోని రాకముందే అహ కప్పుకున్న సిగ్గు జారిపోకముందే మాయజేసి ఒహో మరులుగొల్పి ఒహో మాయజేసి మరులుగొల్పి మాటగల్పి మధురమైన మా మనసు దోచవచ్చునా? నీవు మర్మమెరిగి ఈమాట అడగవచ్చునా ఏమే ఏమే భామా ఏమే ఏమే భామా పడుచుపిల్ల కంటపడితే వెంటబడుదురు అబ్బో వలపంతా ఒలకబోసి ఆశ పెడుదురు॥ పువ్వు మీద. ఒహో పువ్వు మీద వాలు పోతు తేనెటీగ వంటి మగవాళ్ల జిత్తులన్నీ తెలుసులేవయ్యా మా పుట్టి ముంచు కథలన్నీ విన్నామయ్యా మావా మావా మావా మావా మావా మావా హోయ్ హోయ్ హోయ్ హోయ్ హోయ్ హోయ్ కొత్త కొత్త మోజుల్ని కోరువారు రోజు చిత్రంగా వేషాలు మార్చువారూ టక్కరోళ్లుంటారు టక్కులు జేస్తుంటారు నీవు చెప్పు మాట కూడ నిజమేనులే స్నేహం దూరంగా ఉన్నపుడే జోరవునులే అవునే అవునే భామా అవునే అవునే భామా కట్టుబాటు ఉండాలి గౌరవంగా బ్రతకాలి ఆత్రపడక కొంతకాలమాగుదామయా కట్టుబాటు ఉండాలి గౌరవంగా బ్రతకాలి ఆత్రపడక కొంతకాలమాగుదామయా ఫెళ్లున పెళ్లైతే ఇద్దరికీ అడ్డులేదయ్యా మావా మావా మావా మావా మావా మావా
Lyrics sourced from public databases. May contain errors.