Song Details
Lyrics
నువు ఎవ్వరి ఎదలో పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావో నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావో తెలియదే ఎవ్వరికీ తేలదే ఎన్నటికీ అందుకే నీ కథకీ అంతులేదెప్పటికీ తీరాలు లేవే ప్రేమా నీ దారికీ చరణం: 1 కలతలే కోవెలై కొలువయే విలయమా వలపులో నరకమే వరమనే విరహమా తాపమే దీపమా వేదనే వేదమా శాపమే దీవెనా నీకిదే న్యాయమా కన్నీరాభిషేకమా నిరాశ నైవేద్యమా మదిలో మంటలే యాగమా ప్రణయమా నువు ఎవ్వరి ఎదలో పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావో నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావో చరణం: 2 రెప్పలే దాటదే ఎప్పుడూ ఏ కల నింగినే తాకదే కడలిలో ఏ అల నేలపై నిలవదే మెరుపులో మిలమిల కాంతిలా కనబడే భ్రాంతి ఈ వెన్నెల అరణ్యాల మార్గమా అసత్యాల గమ్యమా నీతో పయనమే పాపమా ప్రణయమా నువు ఎవ్వరి ఎదలో పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావో నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావో తెలియదే ఎవ్వరికీ తేలదే ఎన్నటికీ అందుకే నీ కథకీ అంతులేదెప్పటికీ తీరాలు లేవే ప్రేమా నీ దారికీ
Lyrics sourced from public databases. May contain errors.