Song Details
Lyrics
చెలి సోకు లేత చిగురాకు పలుకేమో కాస్త కరుకు కవి కాళిదాసుననుకోకు వలవేసి వెంటపడకు ఎన్నాళ్ళె నీకూ నాకూ తగువులు నీ వల్లే కదా నాకీ చిక్కులు కోపంలో కూడా ఎంత నాజూకు కవి కాళిదాసుననుకోకు వలవేసి వెంటపడకు అన్నానంటే అన్నానంటావ్ అంతేగాని ఆలోచించవ్ నేనే కాదా నీకుండే దిక్కు నాకోసం నువు పుట్టానంటావ్ నేనంటే పడి చస్తానంటావ్ నీకేంటంత నాపై ఈ హక్కు ఇమ్మంటే ప్రాణం ఇస్తా నమ్మవెందుకు పొమ్మంటూ దురం చేస్తావెందుకూ చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పకు నన్నిట్లా నానాహింసపెట్టి చంపకు చెలి సోకు లేత చిగురాకు పలుకేమో కాస్త కరుకు దగ్గరకొస్తే భగ్గంటున్నవ్ పక్కకుపోతే భయపడుతున్నవ్ ఇట్టాగైతే ఎట్టాగేమరి ఆవైపంటే ఈ వైపంటావ్ నే లెప్ట్ అంటే నువు రైట్ అంటావ్ నీతో అన్నీ పేచీలేమరి ఆ పాదం కందెలాగా పరుగులెందుకే నీ భారం నాకే ఇవ్వకా మాటల్తో మంత్రం వేస్తూ తియ్యగా మైకంలో ముంచేస్తావు మెల్లమెల్లగా చెలి సోకు లేత చిగురాకు పలుకేమో కాస్త కరుకు కవి కాళిదాసుననుకోకు వలవేసి వెంటపడకు ఎన్నాళ్ళె నీకూ నాకూ తగువులు నీ వల్లే కదా నాకీ చిక్కులు కోపంలో కూడా ఎంత నాజూకు
Lyrics sourced from public databases. May contain errors.