Song Details
Lyrics
పల్లవి: హ్మ్మ్..హ్మ్మ్మ్ ...హ్మ్మ్.. సిత్రంగా ఉన్నది ఈ ఏల.. ఊగిందినా మనసు ఉయ్యాలా ఊగిందినా మనసు ఉయ్యాలా సిత్రంగా ఉన్నది ఈ ఏల.. ఊగిందినా మనసు ఉయ్యాలా ఊగిందినా మనసు ఉయ్యాలా చరణం: 1 దూరాన ఓ ఏరూ గలగలలాడింది.. గంతులేసింది ఏటీ గాలికి పైట తొలిగిపోయింది... ఎగిరిపోయింది దూరాన ఓ ఏరూ గలగలలాడింది.. గంతులేసింది ఏటీ గాలికి పైట తొలిగిపోయింది... ఎగిరిపోయింది ఎగిరిపోయిన పైట ఏమి సెప్పిందో... పైటలా మా బావ పెనవేసుకున్నాడు సిత్రంగా ఉన్నది ఈ ఏల.. ఊగిందినా మనసు ఉయ్యాలా ఊగిందినా మనసు ఉయ్యాలా చరణం: 2 దూరాన ఓ మబ్బు తొంగి చూసింది... సల్లగా ఓ సిన్న జల్లు కురిసింది జల్లులో మా బావ కళ్ళు కలిపాడు... సిగ్గు ముంచేసింది... బుగ్గ తుంచేశాడు సిత్రంగా ఉన్నది ఈ ఏల.. ఊగిందినా మనసు ఉయ్యాలా ఊగిందినా మనసు ఉయ్యాలా చరణం: 3 దూరాన మా బావ ఒళ్ళు తడిసింది.. ఒణికిపోయింది ఒణికిపోయిన ఒళ్లు వాలిపోయింది.. సోలిపోయింది దూరాన మా బావ ఒళ్ళు తడిసింది.. ఒణికిపోయింది ఒణికిపోయిన ఒళ్లు వాలిపోయింది.. సోలిపోయింది సెంత చేరి సైగ చేసి సేతులు జాపాడు నా వలపులోని వేడి తాను పంచుకున్నాడు సిత్రంగా ఉన్నది ఈ ఏల.. ఊగిందినా మనసు ఉయ్యాలా ఊగిందినా మనసు ఉయ్యాలా సిత్రంగా ఉన్నది ఈ ఏల.. ఊగిందినా మనసు ఉయ్యాలా ఊగిందినా మనసు ఉయ్యాలా
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Kanne Manasulu
See AllEe Udayam Na Hrudayam
Ghantasala
Oho Tamarena Chudavacharu (Female)
P. Susheela
Yemitidhi Yem Jarigindhi
P. Susheela, T. Krishna
Sukkalanti Sinnodu Soku Chesukunnadu
P. Susheela, Jamuna Rani
Oho Tamarena Chudavacharu (Male)
Ghantasala
Ammalaganna Amma Gajulamma
P. Susheela, Radha Kumari, Raavi Kondala Rao, Jamuna Rani, Venkatrao
Valapulo Odhu Odhu Odhantu
P. Susheela
O Hrudayamleni Priyurala
Ghantasala