MovieGQ

O Hrudayamleni Priyurala

Kanne Manasulu (1966) · Track 9 of 9

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

పల్లవి: ఓ హృదయం లేని ప్రియురాలా ఓ హృదయం లేని ప్రియురాలా వలపును రగిలించావు పలుకక ఊర్కున్నావు ఏంకావాలనుకున్నావు వీడేం కావాలనుకున్నావు ఓ.. ఓ ఓ హృదయం లేని ప్రియురాలా చరణం: 1 చిరుజల్లు వలే చిలికావు.. పెను వెల్లువగా ఉరికావు చిరుజల్లు వలే చిలికావు..పెను వెల్లువగా ఉరికావు సుడిగుండముగా వెలిశావు అసలెందుకు కలిసావు...నన్నెందుకు కలిసావు.. ఓ.. ఓ ఓ హృదయం లేని ప్రియురాలా చరణం: 2 అగ్గి వంటి వలపంటించి హాయిగ వుందామనుకోకు అగ్గి వంటి వలపంటించి హాయిగ వుందామనుకోకు మనసు నుంచి మనసుకు పాకి ఆరని గాయం చేస్తుంది...అది తీరని తాపం ఔతుంది ఓ.. ఓ ఓ హృదయం లేని ప్రియురాలా చరణం: 3 నీ మనసుకు తెలుసు నా మనసు.. నీ వయసుకు తెలియదు నీ మనసు నీ మనసుకు తెలుసు నా మనసు..నీ వయసుకు తెలియదు నీ మనసు రాయి మీటితే రాగం పలుకును రాయి కన్న రాయివి నీవు...కసాయివి నీవు ఓ.. ఓ ఓ హృదయం లేని ప్రియురాలా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Kanne Manasulu

See All