Song Details
Lyrics
ఓ రంగుల చిలక చూడే నీ ఎనక అలుపంటూ లేనీ పిల్లడి నడక ఓ బంగారు తళుక చుట్టూ ఈ కలకా ఎక్కడికే ఆ అడుగుల చప్పుడు వినక ఓ సారి ఇటు చూడే పాపం పసివాడే నీ చూపుల కోసం వేచి ఉన్నాడే అన్నీ వదిలేసి నిన్నే వలచాడే నీ తలుపుల్లోనే నిదురే మరిచాడే చరణం: 1 మోమాటలు అన్ని పక్కన వదిలాడే మొండిగ ఆనిను వీడక ముందుకు కదిలాడే ఎవరేమనుకున్న తానేమనుకోడే అండగ నీ ప్రేమలో మైమరుపయ్యడే ఓ సారి ఇటు చూడే పాపం పసివాడే నువ్వు అంటూ లేని ధ్యాసే లేనోడే బిడియం కలవాడే తదయము అనలేదే అయినా నిను గెలిసె మనసే ఉన్నోడే చరణం: 2 నిన్ను అందరికి కంటే మిన్నగా చూస్తాడే నిన్ను ఎవరేమన్నా యుద్ధం చేస్తాడే నీతో నడిచే ఆ ఏడడుగుల కోసం వే వేెలడుగులనైన నడిచే ఘనుడే ఓ సారి ఇటు చూడే పాపం పసివాడే నువు నడిచేదారిని వదలని ప్రేమికుడే గుండె తలుపుల్ని తెరిచి ఉంచాడే దేవత నువ్వంటూ భక్తుడు అయ్యాడే
Lyrics sourced from public databases. May contain errors.