MovieGQ

Kalalu Naavena

Jayammu Nishchayammura (2016) · Track 5 of 5

Song Details

Lyrics

కలలు నావేన కధలు నావేన నీకు చేరింది శూన్యమా తపన నాదేన తలపు నాదేన నీకు నా ఊహే దూరమా కనులతో నే తెలిపిన నా ప్రేమ నిను తాకలేద మనసుతో నే పలికిన రాగాలు వినిపించనే లేదా మనసు నాదేన మమత నాదేన నీకు నేనింత దూరమా పిలుపు నాదేన బదులు నాదేన చలనమేలేని శిల్పమా నీవు పలికిన వేల పదములు ప్రేమ పిలుపులు కావని నాతో నడిచిన వేల అడుగులు సాగు గమనము వేరని నవ్వుతు నను చూసిన చూపుల కధ వేరు అని నేడు నీ చిరునవ్వుతో చేసింది అంతా శూన్యమేనని నిన్ను చూసిన నాటి క్షణమున నా ఎదే నను వీడెలే నేడు నువు లేవన్నా మది నిను వీడి రాలేనందిలే నీవు నా కల చేరితే జగమే మరిచానే నేను నీ కలలోకి చేరే దారి ఏదో తెలియలేదే కలలు నావేన కధలు నావేన నీకు చేరింది శూన్యమా తపన నాదేన తలపు నాదేన నీకు నా ఊహే దూరమా కడలిలా ఉప్పొంగిన గుండెల్లో నీ పైన ప్రేమ కడకిలా నీ మనసులో చినుకంత కలిగించనే లేదా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Jayammu Nishchayammura

See All