Song Details
Lyrics
నీ నవ్వుల్లో వెలిగే వెన్నెలలో నా కనులే మెరిసే ఆ వెలుగులలో నీ చూపుల్లో విరిసే హరివిల్లే నన్నే రంగుల్లో ముంచేసిందే నీ పెదవే పలికే పలుకుల్లో నా తనువే తడిసే తేనెల్లో నీ ఊహాలే నిండిన నా మనసే పాడే పులకింతల సంగీతాలే నువ్వే చిరుగాలుల్లో నువ్వే జడి వానల్లో నువ్వే ఆ మెరుపుల్లో నువ్వే నువ్వే నువ్వే నువ్వే నా కన్నుల్లో నువ్వే నా నవ్వుల్లో నువ్వే నా శ్వాసల్లో నువ్వే నువ్వే నువ్వే నిన్నా ఓ కలనే కన్నా నేడే నిజమై చూస్తున్నా నాలో ఈ సందడి రేపిన సంక్రాంతివి నువ్వేనా లోలో ఎన్నో అనుకున్నా ఏవో చెప్పాలనుకున్నా నాలో ఈ అల్లరి రేపిన చిరుగాలివి నువ్వేనా ఏదోలా ఈ లోకంలో తికమక పడుతూ బతికేస్తున్నా నా ఎదలో సంతోషాల సంద్రామే నింపావే ఏ గుడ్లో గోదారుల్లో కొత్తందాలే చూస్తూ ఉన్నా నే బతికే చందాన్నే నువు కలలా మార్చేశావే నువ్వే ఆ పొద్దుల్లో నువ్వే ఈ వెన్నెల్లో నువ్వే చీకట్లో కూడా నువ్వే నువ్వే నువ్వే నువ్వే నా కన్నుల్లో నువ్వే నా నవ్వుల్లో నువ్వే నా శ్వాసల్లో నువ్వే నువ్వే నువ్వే ఎదో తడబాటున బాటల్లోన పొరపాటున పడుతూ ఉన్నా నా దశనే తిప్పిన నవమి దశమి నువ్వేనా నీలో ఏముందో ఏమో కానీ అది నన్నే నిద్దురలేపి ఏమెరుగని ఏదో లోకాలే చూపేనా ఏవేవో అదృష్టాలే ఆకాశంలో వెతికిన వేళా నాకోసం దిగివచ్చావే చుక్కల్లో ఒక దానా నిను వెతికే దారుల్లోనే నాకే కొత్తగ ఎదురవుతున్నా నా బులుపుని నీ నవ్వుల్లో నేడే చూస్తూ ఉన్నా నువ్వే ఆ పొద్దుల్లో నువ్వే ఈ వెన్నెల్లో నువ్వే చీకట్లో కూడా నువ్వే నువ్వే నువ్వే నువ్వే నా కన్నుల్లో నువ్వే నా నవ్వుల్లో నువ్వే నా శ్వాసల్లో నువ్వే నువ్వే నువ్వే నీ నవ్వుల్లో వెలిగే వెన్నెలలో నా కనులే మెరిసే ఆ వెలుగులలో నీ చూపుల్లో విరిసే హరివిల్లే నన్నే రంగుల్లో ముంచేసిందే
Lyrics sourced from public databases. May contain errors.