Song Details
Lyrics
పల్లవి: ఎగిరే మబ్బులలోనా పగలే వెన్నెల వాన పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో.. ఏ ఉదయం ఏ హృదయం ఓ చేరుతుందో ఈ ప్రేమా ఏ నిమిషం ఏది నిజం ఓ తెలియకుందే ఈ మాయ ఆశ పడితే అందనందే ఊరుకుంటే చేరుకుందే తగువులోనే చిగురు వేసిందే... ఎగిరే మబ్బులలోనా పగలే వెన్నెల వాన పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో (2) చరణం: 1 నిదరోయే నీ కనులు యదలోన ఆ కలలు ఎదురైనా ఎపుడైనా కళ్ళారా చూసేనా నీతో కలిసి నీతో పెరిగి నీతో తిరిగి ఆశగా నిన్నే తలచి నిన్నే పిలిచి ఇన్నాళ్ళుగా నువ్వంటే ఇష్టం ఉన్నా నువ్వే నా సర్వం అన్నా నా గుండెల్లో దాచేసిందే మౌనంగా ప్రేమ చరణం: 2 ఎటువైపే నీ పరుగు వినలేదా నా పిలుపు ఇపుడైనా ఇకనైనా నీ పంతమాగేనా అన్నీ మరిచి కోపం విడిచి నాతో చెలిమే చేసినా పోయే వరకు నా ఈ బతుకు నీదే కదా నీ తోడే కావాలంటు నీ నీడై ఉండాలంటు నవరాగాలు ఆలాపించే నాలో ఈ ప్రేమా ఎగిరే మబ్బులలోనా పగలే వెన్నెల వాన పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో... (2) ఏ ఉదయం ఏ హృదయం ఓ చేరుతుందో ఈ ప్రేమా ఏ నిమిషం ఏది నిజం ఓ తెలియకుందే ఈ మాయ ఆశ పడితే అందనందే ఊరుకుంటే చేరుకుందే తగువులోనే చిగురు వేసిందే... ఎగిరే మబ్బులలోనా పగలే వెన్నెల వాన పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో... (2)
Lyrics sourced from public databases. May contain errors.