Song Details
Lyrics
పల్లవి: ఓ...ఓ...ఓ... నీ కోసం ఒక మధుమాసం అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ తనలో చిగురాశల గంధం నీ శ్వాసకి పంచమని చలిగాలికి చెదరని బంధం నీ నవ్వుతో పెంచమని నీ కోసం ఒక మధుమాసం అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ చరణం: 1 దూరంగానే ఉంటా నువు కందే మంటై చేరగా దీపంలా చూస్తుంటా నడి రేయంతా నీ తోడుగా కలకలాన్ని రగిలిస్తున్న చలి సంకెళ్ళు తెగేట్టుగా నీ కోసం ఒక మధుమాసం చరణం: 2 పాదం నేనై వస్తా దరిచేరే దారే చూపగా ప్రాణం పందెం వేస్తా ప్రతి గెలుపు మెళ్ళో వాలగా కలలెట్టున్నా నీ ముందొచ్చి నిలబడాలి నిజాలుగా నీ కోసం ఒక మధుమాసం అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ తనలో చిగురాశల గంధం నీ శ్వాసకి పంచమని చలిగాలికి చెదరని బంధం నీ నవ్వుతో పెంచమని నీ కోసం ఒక మధుమాసం
Lyrics sourced from public databases. May contain errors.